బొమ్మలతో బోధన

ABN , First Publish Date - 2021-03-04T05:29:20+05:30 IST

విద్యార్థులు పాఠ్యాంశాలను దీర్ఘకాలికంగా గుర్తుపెట్టుకునే విధంగా వినూత్న పద్ధతులను ఎంచుకున్నారు.

బొమ్మలతో బోధన
మాస్క్‌లతో విద్యార్థుల ప్రదర్శన

సులభంగా పాఠ్యాంశాలు గుర్తుండేలా తరగతులు

పోచమ్మగడ్డ తండా పాఠశాలకు జాతీయ స్థాయి గుర్తింపు 

జాతీయ టాయ్స్‌ఫేర్‌-2021కు ఎంపికైన ఉపాధ్యాయురాలు 

కళావతి టాయ్స్‌

జడ్చర్ల, మార్చి 3: విద్యార్థులు పాఠ్యాంశాలను దీర్ఘకాలికంగా గుర్తుపెట్టుకునే విధంగా వినూత్న పద్ధతులను ఎంచుకున్నారు. మాస్క్‌, టాయ్స్‌, హ్యాండ్‌పప్పెట్స్‌, ఫింగర్‌పప్పెట్స్‌, తాళపత్రాల గ్రంథాలు, ఫజిల్స్‌ తదితర పద్ధతుల్లో విద్యాబోధన సాగించారు. దీంతో తాను తయారు చేసిన బొమ్మలు జాతీయ టాయ్స్‌ఫేర్‌-2021కు ఎంపికయ్యాయి. జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కళావతి పాఠ్యాంశాలకనుగుణంగా ముఖానికి ధరించే మాస్క్‌లు, ఆడుకునే బొమ్మలు, హ్యాండ్‌ పప్పెట్స్‌, ఫింగర్‌ పప్పెట్స్‌, ఓరిగామి పప్పెట్స్‌, గ్లోవ్‌ పప్పెట్లతో బోధిస్తున్నారు. తాళపత్రాల గ్రంథాల్లో పొందుపరిచిన విధంగా చరిత్రకు సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు. బొమ్మల రూపంలో బోధిస్తున్న తీరుకు విద్యార్థులు ఆకర్షితులవుతున్నారు. అక్షరాల కూర్పు, పదాల అమరిక వంటి వాటిని ఇంటీరియర్‌ అండ్‌ నెంబర్‌బజ్‌ పద్ధతిలో బోధిస్తున్నారు. వీటితో పాటు బ్రైటర్‌మైండ్‌ అం శాన్ని సైతం బోధిస్తున్నారు. 


జాతీయ స్థాయి టాయ్స్‌ఫేర్‌-2021లో ప్రదర్శన

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టాయ్స్‌ఫేర్‌-2021కు ఉపాధ్యాయురాలు కళావతి బోధించిన టాయ్స్‌ ఎంపికయ్యాయి. 15 రోజుల క్రితం తాను విద్యార్థులకు బోధించిన తీరును ఎస్‌సీఆర్‌ఈటీలో ప్రదర్శించారు. ఫిబ్రవరి 27, 28, మార్చి 1, 2వ తేదీలలో జాతీయ స్థాయి టాయ్స్‌ఫేర్‌-2021లో నాలుగు విభాగాల్లో కళావతి టాయ్స్‌ ప్రదర్శించబడ్డాయి. 


బట్టిపట్టే విధానానికి స్వస్తి పలికేందుకే - కళావతి, ఉపాధ్యాయురాలు 

బట్టిపట్టే విధానానికి స్వస్తి పలకడం, బోధించిన అంశాలు దీర్ఘకాలికంగా గుర్తుపెట్టుకునేలా విద్యార్థులకు బోధించాలనుకున్నాను. టీటీసీ శిక్షణలో పప్పెట్స్‌తో విద్యార్థులకు బోధించే తీరును అధ్యాపకురాలు లలిత చూపించిన విఽధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. మొదటగా స్కిట్స్‌, క్యారెక్టర్‌లుగా విభజించి బోధించాను. గడిచిన 12 సంవత్సరాలుగా మాస్క్‌, హ్యాండ్‌, గ్లోవ్‌, ఫింగర్‌ పప్పెట్స్‌ను స్వయంగా తయారు చేసి వాటి ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తున్నాను. 




Updated Date - 2021-03-04T05:29:20+05:30 IST