
దంబుల్లా: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇక్కడ రణ్‌గిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక మహిళ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు శుభారంభమే లభించింది.
ఓపెనర్లు విష్మి గుణరత్నె (Vishmi Gunaratne)-కెప్టెన్ చమరి అటపట్టు (Chamari Athapaththu) కలిసి తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. విష్మి 50 బంతుల్లో 6 ఫోర్లతో 45 పరుగులు చేయగా, చమరి అటపట్టు 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 43 పరుగులు చేసింది. వీరిద్దరూ అవుటయ్యాక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఆ తర్వాత ఎవరూ క్రీజులో కుదరుకోలేకపోయారు.
మాధవి (9), కవిష దిల్హరి (2), నీలాక్షి డి సిల్వ (1), హాసిని పెరీరా (0), రణసింఘే (5), అనుష్క (8, నాటౌట్), సుగంధిక కమారి (1, నాటౌట్) క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. దీంతో 20 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక ఏడు వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీసుకోగా, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, హర్మన్‌ప్రీత్ కౌర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి