
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో మైనారిటీలో పడిపోయిన శివసేన ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) వర్గం లోక్‌సభకు కొత్త చీఫ్ విప్ (Loksabha chief Whip)ను నియమించింది. ప్రస్తుతం లోక్‌సభలో చీఫ్ విప్‌గా ఉన్న భావ్నా గావ్లి స్థానంలో రంజన్ విచారేను లోక్‌సభలో శివసేన చీఫ్ విప్‌గా నియమించింది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేస్తూ బుధవారం ఒక లేఖ రాశారు.
ఇవి కూడా చదవండి
శివసేనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఏక్‌నాథ్ షిండే ఎట్టకేలకు ఉద్ధవ్ సారథ్యంలోని శివసేన ప్రభుత్వాన్ని గద్దెదింపి ముఖ్యమంత్రి కావడం, అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గిన నేపథ్యంలో ఉద్ధవ్ థాకరే వర్గం అప్రమత్తమైందని, ఎంపీల నుంచి తిరుగుబాటు రాకుండా కొత్త చీఫ్ విప్ నియామకం చేపట్టిందని పార్టీ వర్గాలు తెలిపాయి. బలపరీక్షలో నెగ్గిన తమదే నిజమైన శివసేన అని షిండే వర్గం క్లెయిమ్ చేస్తుండగా, చట్టపరమైన అంశాలన్నీ తమకే సానుకూలమని, తమదే అసలు సిసలైన శివసేన అని ఉద్ధవ్ థాకరే వర్గం వాదనగా ఉంది.