బిందాస్‌ బ్యాచ్‌.. భేష్‌!

May 15 2021 @ 03:50AM

టీమిండియాపై రవిశాస్త్రి ప్రశంసలు


న్యూఢిల్లీ: వరల్డ్‌ నంబర్‌ వన్‌ టెస్ట్‌ జట్టు హోదాకు కోహ్లీసేన అన్నివిధాలా అర్హులని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసించాడు. పాయింట్ల విధానంతోపాటు ఈ మార్గంలో ఎదురైన ఎన్నో అవరోధాలను భారత జట్టు సమర్థంగా అధిగమించి టెస్టుల్లో అగ్ర పీఠాన్ని కైవసం చేసుకొందన్నాడు. ‘నంబర్‌ వన్‌ కిరీటం దక్కించుకోవడానికి టీమిండియా అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదల, ఏకాగ్రతను ప్రదర్శించింది. కుర్రాళ్లు నిజాయితీగా ఆడి, కష్టపడి దీన్ని సాధించారు. మధ్యలో పాయింట్ల విధానాన్ని మార్చినా ఆ అడ్డంకిని టీమిండియా ఎంతో సమర్థంగా అధిగమించింది. ఎంతో క్లిష్ట సమయంలో కుర్రాళ్లు కఠిన క్రికెట్‌ ఆడారు. ఈ బిందాస్‌ బృందం పట్ల అత్యంత సంతోషంగా ఉన్నా’ అని శాస్త్రి ట్వీట్‌ చేశాడు. వార్షిక టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ సేన అగ్రస్థానంలో నిలవగా.. న్యూజిలాండ్‌కు రెండో ర్యాంక్‌ దక్కింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.