కన్నీరు

ABN , First Publish Date - 2021-07-24T04:33:01+05:30 IST

జిల్లాలో ఇంకా వర్షం జోరు కొనసాగుతోంది.

కన్నీరు
వరద ధాటికి బాసర - కిర్గుల్‌ (బి) గ్రామాల మధ్య గల ప్రధాన రహదారి కొట్టుకుపోయిందిలా..

ఆస్తినష్టం రూ.10 కోట్లు

వర్ష బీభత్సంతో తేరుకోని జిల్లా  

నీట మునిగిన పంట పొలాలు 

25చెరువులు.. మరో 25కాలువలు ధ్వంసం 

కోతకు గురైన రోడ్లు  

నేలకొరిగిన 79ట్రాన్స్‌ఫార్మర్లు  

చాలా గ్రామాలకు నిలిచిన కరెంటు సరఫరా

జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు పెద్ద ఎత్తున నష్టాలను తెచ్చిపెట్టాయి. చెరువులు, కాలువలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. జిల్లాలో 25 చెరువులు, మరో 25 కాలువలు ధ్వంసం కాగా.. 600లకు పైగా కరెంటు స్తంభా లు నేలకొరిగాయి. అలాగే 79 ట్రాన్స్‌ఫార్మర్లు సైతం కుప్పకూలాయి. వర్షం ధాటికి జిల్లా అంతా అతలాకుతలమైపోయింది. ఇక్కడి అనేక గ్రామాలకు కరెంటు, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కడెం ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌లో రూ. కోటితో నిర్మించిన కేజ్‌ కల్చర్‌ యూనిట్‌లు వరద ధాటికి కొట్టుకుపోవడంతో.. కన్నీరు మున్నీరవుతున్నారు. మొత్తమ్మీద జిల్లావ్యాప్తంగా రూ.10కోట్ల ఆస్తి నష్టం జరిగింది. 

నిర్మల్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇంకా వర్షం జోరు కొనసాగుతోంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 12.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కడెం మండలంలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొట్టుకుపోయిన చెరువులు, కాలువల వల్ల ఇరిగేషన్‌ శాఖకు రూ. 3 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. పంచాయతీ రాజ్‌ పరిధిలో తొమ్మిది రోడ్లు పూర్తిగా ఽవర్షం తాకిడితో కొట్టుకుపోయిన కారణంగా ఆ శాఖకు రూ. 2.50 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. సారంగాపూర్‌ మండలంలో 6, కుభీర్‌లో 2, ముథోల్‌లో ఓ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోగా.. ఆర్‌అండ్‌బీ శాఖ రోడ్ల నష్టం అంచనాల్లో నిమగ్నమైంది. జిల్లాలో ప్రాజెక్ట్‌ల నీటిమట్టం క్రమంగా పెరిగిపోతోంది. దీంతో రిజర్వాయర్‌ల నుంచి దిగువకు నీరును విడుదల చేస్తున్నారు. కడెం, స్వర్ణ, గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌ల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల గల పంట పొలాలన్ని వర్షం కారణంగా జలమయమయ్యాయి. దీంతో పంటలకు భారీగా నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఈ పంట నష్టానికి సంబందించి అంఛనాల రూపకల్పనలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇటు పంటలు, ఇళ్లలోకి కూడా వరదతో ఇసుక, బురద మేటలు వేశాయి. పంచాయతీ రాజ్‌కు రూ. 2.50 కోట్లు, ఇరిగేషన్‌ శాఖకు రూ.3 కోట్లు, ఈఈ పీఆర్‌ శాఖకు రూ. 2.50 కోట్ల నష్టం జరిగినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కడెం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695.725 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్‌లోకి 28,321 క్యూసెక్కుల వరద నీరు రాగా నాలుగు వరద గేట్లను ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి 46,952 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్ట్‌ నీటిమట్టం 1183 అడుగులు కాగా.. ప్రస్తుతం 1179 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతం నుంచి 2426 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే గడ్డెన్న వాగు ప్రాజెక్ట్‌ నీటిమట్టం 358.7 మీటర్లు కాగా ప్రస్తుతం 358. మీటర్లుగా ఉంది. ప్రాజెక్ట్‌ ఎగువ ప్రాంతం నుంచి 19,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెండు వరద గేట్లను ఎత్తి 21,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

అన్ని శాఖలకు రూ.కోట్లల్లో నష్టం

వరుస వర్షాల కారణంగా అన్ని శాఖలకు అనూహ్యంగా నష్టం వాటిల్లింది. ఇరిగేషన్‌, పంచాయతీ రాజ్‌, వ్యవసా య శాఖ, ఆర్‌ అండ్‌ బి, విద్యుత్‌ శాఖలకు ఈ నష్టం జరిగింది. 25 చెరువులు, 25 కాలువలు ధ్వంసం అయిన కారణంగా ఇరిగేషన్‌ శాఖకు రూ. 3 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. అలాగే జిల్లాలో తొమ్మిది ప్రధాన రోడ్లకు జరిగిన నష్టంతో పంచాయతీ రాజ్‌ శాఖకు రూ. 2.50 కోట్లు, విద్యు త్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు నేలకొరగడంతో విద్యుత్‌ శాఖకు రూ. కోటి వర కు నష్టం జరిగింది. ఆర్‌ అండ్‌బీ శాఖ సైతం రోడ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తోంది. దీంతో పా టు వ్యవసాయ శాఖ పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో నిమగ్నం కాగా.. కొద్ది రోజుల్లోనే నష్టం వివరాలను వెల్లడించనుంది. ఇలా అన్ని శాఖలకు వర్షాలు భారీ నష్టాన్ని తెచ్చి పెట్టాయి. 

ఇంకా కోలుకోని జిల్లా 

వర్షాలు ఇంకా కురుస్తుండడంతో.. జిల్లా పూర్తిస్థాయిలో కోలుకోలేకపోతోంది. తీవ్రత తగ్గినప్పటికీ.. వర్షం మాత్రం యధావిధిగా ముసురు పెట్టింది. దీంతో యంత్రాంగమం తా సహాయక చర్యల్లో నిమగ్నమవుతోంది. ధ్వంసమైన రోడ్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నారు. చెరువులు, కాలువలకు పడ్డ గండ్లను పూడుస్తున్నారు. జి ల్లా కేంద్రంతో పాటు భైంసా పట్టణాల్లో నీట మునిగిన బాధితులకు సహాయక చర్యలు అందిస్తున్నారు. మరోవైపు.. వర్షం కారణంగా రోడ్లన్నీ బురదమయమైపోయా యి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ నిమిషంలో.. ఏం జరుగుతుందోనన్న భయానికి గురవుతున్నారు. వరద ఎటు వైపు నుంచి తన్నుకువస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. 

గుండెగావ్‌ ముంపు బాధితుల ఆందోళన

భైంసా మండలం గుండెగావ్‌ గ్రామంలో ముంపు బాధితుల ఆందోళన కొనసాగుతోంది. గుండెగావ్‌ బాధితులకు బీజేపీ బాసటగా నిలుస్తోంది. బాధితులంతా భైంసా పట్టణంలోని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు.

మంత్రి , కలెక్టర్‌ విస్త ృత పర్యటన

వర్షంతో నష్టపోయిన ప్రాంతాలను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డితో పాటు కలెక్టర్‌, పలువురు ప్రజా ప్రతినిధులు శుక్రవారం పరిశీలించా రు. పట్టణంతో పాటు సారంగాపూర్‌ మండలంలో మంత్రి అల్లోల పర్యటించి నష్టం అంచనాను తెలుసుకున్నారు. అలాగే నష్టపోయిన బాధితులను మంత్రి పరామర్శించి ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మం త్రి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అలాగే జి ల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేతో పాటు తదితర ఉన్నతాధికారులు కూడా వర్షం కారణంగా నష్టపోయిన పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అలాగే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ మండలాల అధికారులను కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఆదేశించారు. 


Updated Date - 2021-07-24T04:33:01+05:30 IST