టెక్‌మహీంద్రాకు ‘సుప్రీం’లో ఊరట

ABN , First Publish Date - 2021-03-02T06:33:22+05:30 IST

సత్యం కంప్యూటర్స్‌ కేసులో టెక్‌ మహీంద్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్‌కు చెందిన రూ.822 కోట్ల డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేయడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది

టెక్‌మహీంద్రాకు ‘సుప్రీం’లో ఊరట

న్యూఢిల్లీ : సత్యం కంప్యూటర్స్‌ కేసులో టెక్‌ మహీంద్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సత్యం కంప్యూటర్స్‌కు చెందిన రూ.822 కోట్ల డిపాజిట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేయడాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ), 2002 కింద ఈడీ 2012లో ఈ డిపాజిట్లను జప్తు చేసింది. 2018 డిసెంబరులో ఈ చర్యను హైదరాబాద్‌ హైకో ర్టు తోసిపుచ్చింది. దీంతో ఈడీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఈడీకి నిరాశే ఎదురైంది. ఈ డిపాజి ట్లు సత్యం కంప్యూటర్స్‌ మాజీ ప్రమోటర్‌ రామలింగ రాజు, అతని సన్నిహితుల అక్రమ సంపాదన అని ఈడీ వాదన. 

Updated Date - 2021-03-02T06:33:22+05:30 IST