టెక్నో ఎలక్ట్రిక్ రచ్చ రంబోలా.. పెద్ద ఎత్తున ఆర్డర్లతో దూసుకెళ్లిన షేర్లు

ABN , First Publish Date - 2022-08-17T18:30:53+05:30 IST

టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్(Techno Electric & Engineering) కంపెనీ రచ్చ రంబోలా చేసింది..

టెక్నో ఎలక్ట్రిక్ రచ్చ రంబోలా.. పెద్ద ఎత్తున ఆర్డర్లతో దూసుకెళ్లిన షేర్లు

Techno Electric & Engineering Shares : టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్(Techno Electric & Engineering) కంపెనీ రచ్చ రంబోలా చేసింది.. ఓ రేంజ్‌లో పరుగులు పెట్టింది. దీనికి కారణం ఏంటంటే.. రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్(RRVUN) నుంచి ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (FGD) కోసం రూ.1,455 కోట్ల ఆర్డర్‌ను గెలుచుకుంది. దీంతో కంపెనీ షేర్లు పరుగులు తీశాయి. బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 12 శాతం పెరిగి రూ.314.50కి చేరుకున్నాయి.


కోట (1x210 MW +2 X 195 MW) నుంచి కంపెనీ రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ రూ. 666-కోట్ల ఆర్డర్‌ను పొందింది. ఇక ఝలావర్ (2x 600 MW) నుండి రూ. 789-కోట్ల ఆర్డర్‌ను అందుకుంది. ఉదయం 09:29 గంటలకు ఇంజినీరింగ్, డిజైనింగ్ అండ్ నిర్మాణ కంపెనీ షేరు 9 శాతం పెరిగి రూ.306.10 వద్ద ట్రేడవుతోంది. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్(S&P BSE Sensex) 0.27 శాతం పెరిగి 60,002కి చేరుకుంది. జూలై 7, 2022న షేరు 52 వారాల గరిష్ఠం రూ.319.90కి చేరింది. 


గత వారం టెక్నో ఎలక్ట్రిక్ మొత్తం రూ. 680 కోట్ల ట్రాన్స్‌మిషన్ కోసం కొత్త ఆర్డర్‌లను పొందింది. ఈ ఆర్డర్‌లలో ఖవ్దా భుజ్ ట్రాన్స్‌మిషన్(Khavda Bhuj Transmission) నుంచి రూ. 233 కోట్ల ఆర్డర్, ఛత్తీస్‌గఢ్ స్టేట్ పవర్ ట్రాన్స్‌మిషన్ కో(Chhattisgarh State Power Transmission Co) నుంచి రూ. 145 కోట్ల ఆర్డర్ ఉన్నాయి. ఆగస్ట్ 16, 2022 వరకు, టెక్నో ఎలక్ట్రిక్ స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఓపెన్ మార్కెట్ ద్వారా 40,000 ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకు రూ.325కు మించకుండా రూ.130 కోట్ల వరకూ ఉన్న ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయాలని కంపెనీ ప్రతిపాదించింది.


Updated Date - 2022-08-17T18:30:53+05:30 IST