నేటి నుంచి సాధారణ ప్రజలకు టీకా

ABN , First Publish Date - 2021-03-01T07:28:51+05:30 IST

మలిదశ వ్యాక్సినేషన్‌కు గ్రేటర్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది.

నేటి నుంచి సాధారణ ప్రజలకు టీకా

గ్రేటర్‌ పరిధిలో 33 కేంద్రాలు ఎంపిక

ఒక్కో కేంద్రంలో రోజుకు 200 మందికి.. 

ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్‌ శ్వేతా మహంతి 

  

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): మలిదశ వ్యాక్సినేషన్‌కు గ్రేటర్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. అరవై ఏళ్లు నిండిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులున్న 45 ఏళ్లు నిండిన వారందరికీ సోమవారం నుంచి కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇందుకు 14 ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. 19 ప్రైవేట్‌, కార్పొరేట్‌  ఆసుపత్రులను ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 200 మందికి టీకాలు ఇవ్వనున్నారు. 

కలెక్టర్‌ సమీక్ష

రెండో దశ వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లపై హైదరాబాద్‌ జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని డీఎంఅండ్‌ హెచ్‌వో కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. కలెక్టర్‌ శ్వేతామహంతి వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లను సమీక్షించారు. సోమవారం నుంచి సాధారణ ప్రజలకు కరోనా టీకా ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ శ్యాంసన్‌, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పద్మజ, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ వెంకటి, డీఐవో డాక్టర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

ప్రభుత్వ ఆస్పత్రులు..

గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌, ఈఎన్‌టీ, సరోజినీదేవి, కోఠి జిల్లా ప్రభుత్వ ఆసుప్రతులు, మలక్‌పేట, గోల్కొండ, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రులు, పాల్‌దాస్‌ యూపీహెచ్‌సీ, నిజామియా టిబ్బి, ఈఎ్‌సఐసీ మెడికల్‌ కాలేజీ, కొండాపూర్‌ జిల్లా  ఆస్పత్రి, మల్కాజిగిరిలోని ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌.

ప్రైవేట్‌ ఆస్పత్రులు..

బసవతారకం-ఇండో అమెరికన్‌ కేన్సర్‌, జూబ్లీహిల్స్‌లోని అపోలో, అపోలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రిసర్చ్‌, సికింద్రాబాద్‌ యశోద, సోమాజిగూడలోని యశోద, మలక్‌పేట యశోద, ప్రిన్సెస్‌ ఎస్రా, కాంటినెంటల్‌, మెడికవర్‌, ప్రతి మ, నాంపల్లిలోని కేర్‌, బంజారాహిల్స్‌ కేర్‌, సెంచూరీ, మినిస్ట్రీ రోడ్డులోని కిమ్స్‌, షేర్‌  మెడికల్‌ కేర్‌ మెడిసిటీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌, మేడ్చల్‌లోని మల్లారెడ్డి, మమత అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌, కామినేని, బంజారాహిల్స్‌ స్టార్‌ ఆస్పత్రి. 

Updated Date - 2021-03-01T07:28:51+05:30 IST