వధువుకు 16.. వరుడికి 45, ముసలి మొగుడి నుంచి ఆ బాలిక ఎలా తప్పించుకుందంటే..

Published: Sun, 27 Mar 2022 00:04:02 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వధువుకు 16.. వరుడికి 45, ముసలి మొగుడి నుంచి ఆ బాలిక ఎలా తప్పించుకుందంటే..

ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. ఆమె తల్లిదండ్రులు ఒక 45 ఏళ్ల పురుషుడితో ఆమె వివాహం చేశారు. పెళ్లైన సంత్సరం తరువాత ఆ మైనర్ పెళ్లికూతురు ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ తరువాత ఒకరోజు ఇంటి నుంచి పారిపోయింది. ఆమె ఎవరితో పారిపోయిందో తెలిసి కుటుంబ సభ్యులంతా షాక్!


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఢోల్‌పూర్ నగరంలో నివసించే పార్వతి(16) అనే బాలికకు 2021లో విక్రమ్ సింగ్(45) అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తరువాత వారిద్దరికీ ఒక పాప పుట్టింది. కొన్ని రోజుల తరువాత పార్వతి తన పాపను తీసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. పార్వతి ఎక్కడికి పోయిందో ఎవరికీ తెలియలేదు. దీంతో విక్రమ్ సింగ్ తన భార్య పార్వతిని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


పోలీసులు పార్వతి కోసం వెతుకుతుండగా.. తనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది. తనకోసం ఎవరో వెతక వద్దని తనకు ముసలి భర్తతో ఉండడం ఇష్టం లేదని చెప్పింది. పార్వతి ఆ తరువాత కూడా అప్పుడప్పుడూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తూనే ఉంది. అయితే ప్రతి సారీ వేర్వేరు నెంబర్లతో ఫోన్ చేసేది. దీంతో పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది.


చివరికి పార్వతి హర్యాణాలో ఉన్నట్లు పోలీసులు తెలుసుకొని అక్కడికి వెళ్లారు. అక్కడ పార్వతితో పాటు ఎవరున్నారో తెలిసి అందరూ షాకయ్యారు. పార్వతి పెళ్లి తరువాత తన భర్త అన్న కుమారుడు రోహిత్(22)ని ప్రేమించింది. వయసులో తనకంటే దాదాపు మూడు రెట్లు పెద్దవాడైన భర్త అంటే పార్వతికి ఇష్టంలేదు. అందుకే తను ప్రేమించిన రోహిత్‌తో పార్వతి పారిపోయింది. ఇద్దరూ కలిసి హర్యణా వెళ్లిపోయారు. అక్కడ పార్వతి ఒక స్కూలులో చిన్న ఉ్యదోగంలో చేరి తన పాప, ప్రియుడితో హాయిగా జీవిస్తోంది. అయితే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని మైనర్ బాలికల వసతి గృహానికి తరలించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.