Onlineలో Video చూశాడు.. భవనంపై నుంచి దూకేశాడు..!

ABN , First Publish Date - 2022-05-05T21:58:56+05:30 IST

ఆన్‌లైన్ గేమ్‌ చూసి ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. దావణెగెరె జిల్లాలో ఏప్రిల్ 23న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌లో ఓ యానిమేషన్‌ గేమ్‌ చూసిన విద్యార్ధి.

Onlineలో Video చూశాడు.. భవనంపై నుంచి దూకేశాడు..!

ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ గేమ్‌ చూసి ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. దావణెగెరె జిల్లాలో ఏప్రిల్ 23న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌లో ఓ యానిమేషన్‌ గేమ్‌ చూసిన విద్యార్ధి.. ఆ తర్వాత ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చనిపోయే ముందు ఆ బాలుడు గూగుల్​లో ఓ ఆన్​లైన్ గేమ్​కు సంబంధించిన యానిమేషన్ వీడియోల గురించి సెర్చ్ చేశాడని నిర్ధారించారు. ఈ వీడియో చూసిన తర్వాతే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేయగా.. దర్యాప్తులో కీలక బయటికొచ్చాయి. చనిపోయే ముందుకు అతడు తన చెయ్యిని కూడా కోసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్​లో.. తన చావుకు తానే కారణమని రాశాడని వివరించారు. అయితే, చేతిరాతను పోల్చి చూసేందుకు నోట్​ను నిపుణులు వద్దకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.


Read more