ఆ అధికారం తహసీల్దార్‌లకు లేదు

ABN , First Publish Date - 2022-05-24T08:39:09+05:30 IST

రిజిస్ట్రేషన్‌ నిషేధిత ఆస్తుల జాబితాను తయారు చేసి సబ్‌ రిజిస్ట్రార్‌లకు పంపే అధికారం తహసీల్దార్‌లకు లేద ని హైకోర్టు తేల్చిచెప్పింది.

ఆ అధికారం తహసీల్దార్‌లకు లేదు

అమరావతి,  మే 23(ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్‌ నిషేధిత ఆస్తుల జాబితాను తయారు చేసి సబ్‌ రిజిస్ట్రార్‌లకు పంపే అధికారం తహసీల్దార్‌లకు లేద ని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 2007లో మారదర్శకాలు జారీ చేసిందని తెలిపింది. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22ఏ ప్రకా రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్థిర ఆస్తుల వివరాలతో రిజిస్ట్రేషన్‌ నిషేధిత ఆస్తుల జాబితాను సబ్‌ రిజిస్ట్రార్లకు పంపించే అధికారం జిల్లా కలెక్టర్లకే ఉందని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్ష న్‌ 22(ఏ)(1)(ఏ),(బీ) కింద ఉండి జిల్లా కలెక్టర్‌ ద్వారా వచ్చిన రిజిస్ట్రేషన్‌ నిషేధిత ఆస్తుల వివరాలను మాత్రమే సబ్‌ రిజిస్ట్రార్‌ పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. వివిధ ప్రభుత్వశాఖల అధికారుల నుంచి నేరుగా వచ్చిన జాబితాకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చింది. అదేసమయంలో ఇతర శాఖల నుంచి వచ్చిన నిషేధిత భూముల జాబితాలను క్షుణంగా పరిశీలించి.. సంతృప్తి చెందిన తరువాతే కలెక్టర్‌ ఆ వివరాలను రిజిస్ట్రేషన్‌ అధికారులకు పం పించాలని, పోస్టుమెన్‌ పా త్ర పోషించకూడదని తెలిపింది.


ప్రస్తుత కేసులో తహసీల్దార్‌ నిషేధిత భూ ముల జాబితాను నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపించారని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత జాబితాను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి ఇటీవల కీలక తీర్పు ఇచ్చారు. చిత్తూరు జిల్లా కురబాలకోటమండలం, అనగల్లు గ్రామం పరిధిలోని సర్వే నెం. 111/3డీ, 111/3ఈ లో ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ కోటాలో కేటాయించిన మొత్తం 3.88 ఎకరాల్లో 3.14 ఎకరాల భూమిని ఎలాంటి అధికారం లేకుండా తహసిల్దార్‌ రిజిస్ట్రేషన్‌ నిషేధిత భూముల జాబితా 22(ఏ)లో చేర్చి.. ఆ జాబితాను సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపించారని, ఆ భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ చిత్తూరు జిల్లా, మదనపల్లె మండలానికి చెందిన దోమలపాటి సరళ మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌ కోటా కింద కృష్ణమూర్తినాయుడికి రెవెన్యూ అధికారులు డీఫాం పట్టా ఇచ్చారన్నారు. పదేళ్ల తరువాత దీనిని విక్రయించుకోవచ్చునన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి సంబంధిత భూమిని పిటిషనర్ల పేరు మీద రాశారన్నారు. వీరు ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నించగా.. తహసీల్దార్‌ ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ నిషేధిత జాబితా చేర్చారని సబ్‌ రిజిస్ట్రార్‌ తెలిపారన్నారు. భూమిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిరాకరించారన్నారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... కృష్ణమూర్తినాయుడికి ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ కోటా కింద భూమిని కేటాయించలేదన్నారు. భూమిలేని నిరుపేద కేటగిరీ కింద ఇచ్చినట్లు అసైన్డ్‌ రిజిస్టర్‌లో ఉందన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఎక్స్‌సర్వీ్‌సమెన్‌ కోటా కింద భూమిని కేటాయించలేదని నిర్ధారించారు. పిటిషనర్ల వాదనను తోసిపుచ్చారు.  

Updated Date - 2022-05-24T08:39:09+05:30 IST