లాలూ కుమారుని నూతన అగర్బత్తీ కంపెనీలో కలకలం

Sep 15 2021 @ 08:27AM

పట్నా(బీహార్): ఆర్జేడీ చీఫ్ లాలూ కుమారుడు, పార్టీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కొన్ని నెలల క్రితమే అగర్బత్తీ వ్యాపారం ప్రారంభించారు. ఆర్‌ఎల్ అగర్బత్తీ పేరిట ఏర్పాటైన ఈ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి రూ. 71 వేలు తీసుకుని పరారయ్యాడు. ఈ నేపధ్యంలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఎస్‌కే పురి పోలీస్‌స్టేషన్‌లో తన కంపెనీలోని ఆశీష్ రంజన్ అనే ఉద్యోగిపై ఫిర్యాదు చేశారు. కంపెనీలో మార్కెటింగ్ వ్యవహారాలు చూసే రంజన్ రూ. 71 వేలు తీసుకుని పరారయ్యాడని తేజ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆశీష్ రంజన్ కోసం వెదుకులాట ప్రారంభించారు. కాగా ఆశీష్ పట్నాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.