తెలంగాణ ఆణిముత్యం బెల్లి లలిత

ABN , First Publish Date - 2022-05-27T07:12:13+05:30 IST

తెలంగాణ ఆణిముత్యం బెల్లి లలితని పలువురు వక్తలు అన్నారు. ప్రజా గాయకురాలు బెల్లి లలిత 23వ వర్ధం తిని పురస్కరించుకొని గురువారం భువనగిరిలో ఆమె చిత్రపటానికి పలువురు నివాళులర్పించి మాట్లాడారు.

తెలంగాణ ఆణిముత్యం బెల్లి లలిత
భువనగిరిలో బెల్లి లలిత చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

భువనగిరి టౌన్‌, మే 26: తెలంగాణ ఆణిముత్యం బెల్లి లలితని పలువురు వక్తలు అన్నారు. ప్రజా గాయకురాలు బెల్లి లలిత 23వ వర్ధం తిని పురస్కరించుకొని గురువారం భువనగిరిలో ఆమె చిత్రపటానికి పలువురు నివాళులర్పించి మాట్లాడారు. ఆట పాటలతో ప్రజలను చైతన్యం చేస్తున్న  లలితను అప్పటి ప్రభుత్వం, పోలీసులు నయీం ముఠాతో హత్య చేయించారని అన్నారు. లలిత రచించిన పాటలను పలువురు పాడి అలకరించారు.  ఈ సందర్భంగా  పేదలకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో బెల్లి లలిత కుమారుడు బెల్లి సూర్యప్రకాశ్‌, నాయకులు గుర్రాల శ్రీనివాస్‌, సురేష్‌, జనగాం కవితా నర్సింహాచారి, శివుడు, సృజన శంకర్‌, ఊదరి సతీష్‌, ఆటో వెంకటేష్‌, బలరాం, గుండెబోయిన రాజు, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

బెల్లి లలిత ఆశయ సాధనకు కృషి చేయాలి

మోత్కూరు: తెలంగాణ గాన కోకిల బెల్లి లలిత ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్‌ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌, బెల్లి లలిత కుమారుడు శ్రీరామ్‌ మురళీయాదవ్‌ కోరారు. బెల్లి లలితవర్ధంతి సందర్భంగా మోత్కూరులో వారు వేర్వేరుగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో మోత్కూరు మార్కెట్‌ చైర్మన్‌ కొణతం యాకూబ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మునిసిపాలిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ బొడ్డుపల్లి కల్యాణ్‌చక్రవర్తి, నాయకులు జంగ శ్రీనివాస్‌, జంగ వెంకట నర్సు, కూరెల్ల అశోక్‌, సాగర్‌, సాయికుమార్‌, గనగాని నగేష్‌, శెట్టి వేణు, బుంగ యాదయ్య, మణికంఠ,  ఇబ్రహీం, ఉమేష్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-05-27T07:12:13+05:30 IST