Assembly: అసెంబ్లీ వద్ద పోలీసుల హడావిడి

ABN , First Publish Date - 2022-09-12T16:09:19+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వద్ద పోలీసుల హడావిడి నెలకొంది.

Assembly: అసెంబ్లీ వద్ద పోలీసుల హడావిడి

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వద్ద పోలీసుల హడావిడి నెలకొంది. బీజేపీ ఎమ్మేల్యే ఈటెల రాజేందర్‌ (Etela Rajender)ను సస్పెండ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 6న స్పీకర్‌ను మరమనిషిలా వ్యవహరిస్తున్నారని ఈటల కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్‌పై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈటల క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. అయితే తన కామెంట్స్‌ను ఈటల సమర్థించుకున్నారు. దాంతో సోమవారం సభలో ఈటెలపై తీర్మానం పెడతారని జోరుగా చర్చ జరుగుతోంది. 


కాగా మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సంఘాలు, వీఆర్ఏలు, టీచర్స్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల ఎలాంటి నిరసనలు ధర్నాలకు అనుమతి లేందని పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2022-09-12T16:09:19+05:30 IST