నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-07T13:58:58+05:30 IST

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11:30 గంటలకు సమావేశాలు మొదలవ్వనున్నాయి.

నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11:30 గంటలకు సమావేశాలు మొదలవ్వనున్నాయి. జాయింట్ సెషన్, గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి హరీష్‌రావు ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి ఫిలింనగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీకి చేరుకోనున్నారు. మరోవైపు బడ్జెట్ సమావేశాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మీడియాపై కోవిడ్ ఆంక్షలను కొనసాగించారు. లాబీలోకి మీడియా ప్రతినిధుల అనుమతిని నిరాకరించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం జరుగనుంది. అసెంబ్లీ పనిదినాలు బీఏసీలో ఖరారు చేయనున్నారు. 

Updated Date - 2022-03-07T13:58:58+05:30 IST