Telangana Assembly సమావేశాలు నిరవధిక వాయిదా

ABN , First Publish Date - 2022-09-14T00:15:47+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 6న ప్రారంభమైన సమావేశాలు.. విరామం తర్వాత 3 రోజుల 11 గంటలపాటు సమావేశాలు జరిగాయి. 8 బిల్లులకు..

Telangana Assembly సమావేశాలు నిరవధిక వాయిదా

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) నిరవధికంగా వాయిదా (Postponed) పడ్డాయి. ఈ నెల 6న ప్రారంభమైన సమావేశాలు 12, 13 తేదీల్లో మాత్రమే జరిగాయి. 3 రోజుల 11 గంటలపాటు సమావేశాలు జరిగాయి. 3 అంశాలపై లఘు చర్చ జరిగింది. 8 బిల్లులకు ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఈ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వానికి పంపాలని నిర్ణయించింది. ఇక సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. సభాపతిని ఉద్దేశించి అనుచితంగా వ్యాఖ్యానించారని సస్పెండ్ చేశారు.  


Updated Date - 2022-09-14T00:15:47+05:30 IST