BJP Secret Survey In Telangana: బీజేపీ రహస్య సర్వే.. ఏం తేలిందంటే..!

ABN , First Publish Date - 2022-09-06T23:49:50+05:30 IST

తెలంగాణలో పట్టు బిగించేందుకు జాతీయ బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ...

BJP Secret Survey In Telangana: బీజేపీ రహస్య సర్వే.. ఏం తేలిందంటే..!

హైదరాబాద్ (Hydabad): తెలంగాణ (Telangana)లో పట్టు బిగించేందుకు జాతీయ బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే పార్టీ బలంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే (Survey) చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణకు బీజేపీ సెంట్రల్ టీంల (Bjp Central Teams)ను పంపింది. మూడు నెలలుగా తెలంగాణను బీజేపీ సెంట్రల్ టీంలు జల్లెడ పడుతున్నాయి.  మొత్తం 57టీంలు రాష్ట్రానికి వచ్చానట్లు బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. 


ఇక పోలింగ్ బూత్లు వారీగా సెంట్రల్ టీంలు పూర్తి సమాచారాన్ని సేకరించాయి.  ప్రతి నియోజకవర్గంలో ఆయా పార్టీల బలం, అభ్యర్థుల బలాబలాలు, సామాజికవర్గాల వారీగా డీలైల్డ్ రిపోర్ట్‌ను తయారు చేశాయి. వీటిని జాతీయ నాయకత్వానికి అందజేశాయి. సెంట్రల్ టీంస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మూడు రోజులుగా బీజేపీ కార్యాలయంలో సమీక్షలు జరుగుతున్నాయి.  నియోజకవర్గాల వారీగా ఆశావాహుల జాబితాను కూడా కమలం పార్టీ సిద్ధం చేసింది.  పని తీరు బాగా లేని పలువురు జిల్లాల అధ్యక్షులకు తీరు మార్చుకోకుంటే వేటు తప్పదని హెచ్చరికలు కూడా జారీ చేసింది. 


ఈ మేరకు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా (Sc Morcha), మహిళా మోర్చాపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సమీక్ష నిర్వహించారు.  మహిళా మోర్చా పనితీరుపై రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.   మహిళా సమస్యలపై పోరాటం చేయటంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని తీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు. బుధవారం జిల్లా ఇంఛార్జులు, పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతో బండి సంజయ్ సమీక్ష నిర్వహించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. 


Updated Date - 2022-09-06T23:49:50+05:30 IST