కెనడాలో TCA ఆధ్వ‌ర్యంలో ధూంధాం 2022 వేడుకలు

ABN , First Publish Date - 2022-07-13T15:25:34+05:30 IST

తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఈ నెల 9న(శనివారం) గేృటర్ టోరంటో నగరంలోని కెనడా తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ధూంధాం 2022 ఉత్సవాలను ఓక్‌విల్లే (Oakville)లో హాలీ ట్రినిటీ సెకండరీ స్కూల్‌లో ఘనంగా జరుపుకున్నారు.

కెనడాలో TCA ఆధ్వ‌ర్యంలో ధూంధాం 2022 వేడుకలు

ఎన్నారై డెస్క్: తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో ఈ నెల 9న(శనివారం) గ్రేటర్ టోరంటో నగరంలోని కెనడా తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ధూంధాం 2022 ఉత్సవాలను ఓక్‌విల్లే (Oakville)లో హాలీ ట్రినిటీ సెకండరీ స్కూల్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలను TCA కార్యదర్శి దామోదర్ రెడ్డి మాది ప్రారంభించగా.. విష్ణుప్రియ ఈద,  కవిత తిరుమలాపురం, దీప గజవాడ, రజని మాది, వసంత రుద్రోజి దీప ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు ఈద రాజేశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రక్రియలో టొరంటో నగరం నుండి TCA ఆధ్వర్యములో చేసిన కృషిని కొనియాడారు. ఫౌండేషన్ కమిటీ చైర్ వేణు రోకండ్ల, ట్రస్టీ చైర్ సంతోష్ గజవాడ, వైస్ ప్రెసిడెంట్ మన్నెం శ్రీనివాస్, కల్చరల్ సెక్రటరీ కవిత తిరుమలాపురం ఆరంభ ప్రసంగంతో అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.


ఈ కార్యక్రమములో MLC కల్వకుంట్ల కవిత వర్చ్యువల్‌గా పాల్గొని TCA కార్య వర్గ సభ్యులకు, కెనడా తెలంగాణ, తెలుగు వాసులకు ధూమ్ ధామ్ 2022 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలకు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ యాసను సినిమా ప్రపంచానికి వాడకంలో తీసుకొచ్చిన నటుడు, గౌరవ అతిథి తనికెళ్ళ భరణి కూడా వర్చ్యువల్‌గా పాల్గొని ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి శివుడి మీద పుస్తకాలని పంపిణి చేశారు. ముఖ్య అతిధి ధీరజ్ పరీఖ్ కాన్సుల్ జనరల్- వెల్ఫేర్, గెస్ట్ స్పీకర్ ఒంటారియో రాష్త్ర ఎంపీపీ దీపక్ ఆనంద్ విచ్చేసి TCA వారు తెలంగాణ సంస్కృతినీ భావితరాలకు చేర్చే విధానాన్ని అభినందిస్తూ గవర్నమెంట్ అప్ప్రీసియేషన్స్ సర్టిఫికెట్ TCA ప్రెసిడెంట్ కు అందజేశారు.


ఆకట్టుకున్న భోనాలు, మహా జాతర సమ్మక్క – సారలమ్మ

ఈ కార్యక్రమములో తెలంగాణ సంస్కృతికి  అద్దం పట్టేల బోనాల ఊరేగింపుతో  మేడారం తెలంగాణ మహా జాతర సమ్మక్క-సారలమ్మను చిలకల గుట్ట ద్వారా తీసుకు వచ్చే విధానం, విజయకుమార్ తిరుమలాపురం, మూర్తి కలగోని డప్పు వాయిద్యాలతో ఘనంగా చిన్నారుల జాతర ప్రదర్శించిన తీరు సభికులను ఎంతగానో ఆకట్టుకుంది.


తదుపరి కార్యక్రమంలో ఎత్తరాజెండా (RRR movie)ప్లే 15 మంది చిన్నారులతో కనుల విందుగా ప్రదర్శించారు. ధీరజ్ బర్ల, లక్ష్మి సంధ్య పాటల లొల్లితో ధూమ్ ధామ్‌గా సభికులను ఉర్రూతలూ ఊగించారు. TCA వారు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు లోకల్ టాలెంట్ వారితో, కలర్ ఫుల్‌గా ఆర్గనైజ్ చెయ్యడం పట్ల పలువురు ప్రశంసించారు. ఈ సంబరాలలో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నవీన్ ఆకుల, ఉదయ్ భాస్కర్ గుగ్గిళ్ల, బోర్డు ఆఫ్ ట్రస్టీ శ్రీనివాస్ రెడ్డి దేపా, రాజేష్ అర్రా, ప్రకాష్ చిట్యాల, మనోజ్ రెడ్డి, ఫౌండేషన్ కమిటీ సభ్యులు విజయ్ కుమార్ తిరుమలాపురం, కోటేశ్వర్ రావు చిత్తలూరి, శ్రీనివాస్ తిరునగరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల పాల్గొన్నారు. 


ఈ కార్యక్రమానికి రాహుల్ బాలినేని, కుమారి ధాత్రి అంబటి వేడుకల మాస్టర్స్‌గా వ్యవహరించారు. TCA వారు తెలంగాణ ప్రామాణికమైన బిర్యానీ, రుచికరమైన భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమం స్థానిక తెలుగు వారితో సుమారు 4గంటల పాటు ప్రదర్శించటం విశేషం. ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం కృతజ్ఞత వందన సమర్పణతో విజయవంతంగా ఈ సంబరాలు ముగిశాయి.



Updated Date - 2022-07-13T15:25:34+05:30 IST