
బెంగళూరు: మాజీ ప్రధానమంత్రి దొడ్డెగౌడ దేవెగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. బెంగళూరులోని తమ నివాసంలో కేసీఆర్‌కు దేవెగౌడతో పాటు ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ తదితరులున్నారు.

జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కూటమి ఏర్పాటు దిశగా నేతలు చర్చించారని సమాచారం. ఇప్పటికే ఈ దిశగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు సీఎం, డిఎంకే అధినేత స్టాలిన్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులతో వేర్వేరుగా జరిపిన చర్చల వివరాలను దేవెగౌడకు కేసీఆర్ వివరించినట్లు తెలిసింది.
