తెలంగాణలో కరోనా ఉధృతి... ఒక్కరోజే ఎన్నికేసులంటే?

ABN , First Publish Date - 2022-01-18T16:22:14+05:30 IST

రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. ఒక్కరోజే 2447 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణలో కరోనా ఉధృతి... ఒక్కరోజే ఎన్నికేసులంటే?

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉంది.  ఒక్కరోజే 2447 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,112, రంగారెడ్డి జిల్లాలో 183, మేడ్చెల్ జిల్లాలో 235 కరోనా కేసులు నమోదు అయ్యాయి. జంట నగరాల పరిధిలోనే సగానికి ఎక్కువ కరోన కేసులు ఉన్నాయి. ప్రజలతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 119 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో పీజీలు 40, ఫ్యాకల్టీ 6 ,హౌస్ సర్జన్ 38, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 35 మంది ఉన్నారు. ఉస్మానియా ఆసుపత్రి పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రిలలో మొత్తంగా 159 మంది వైద్య సిబ్బంది కరోనా ఎఫెక్ట్ పండింది. ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 60 మందికి కరోనా సోకగా... అందులో 10మందికి పైగా డాక్టర్స్ ఉన్నారు. మరోవైపు హాస్పిటల్‌లో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.  ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్‌లో 2200 మంది రోగులు ఉన్నారు. టిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 69 మంది కరోనా పేషేంట్స్‌‌లు చికిత్స పొందారు. గాంధీ ఆస్పత్రిలో 153 మంది కరోనా పేషెంట్స్‌కు చికిత్స అందింది. 

Updated Date - 2022-01-18T16:22:14+05:30 IST