తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-12-08T19:05:39+05:30 IST

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నిబంధలను తుంగలో తొక్కారంటూ ప్రభుత్వాన్ని మందలించింది. ఇటీవల మున్సిపాలిటిల్లో ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై ఈసీ మండిపడింది. ఈ వ్యవహారానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆగ్రహంతో వెంటనే జీవోను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.


అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెడుతోందని ఈసీకి విపక్షాలు వరుస ఫిర్యాదులపైనా ఈసీ స్పందించింది. జిల్లా, మండల పరిషత్‌లకు రూ.250 కోట్ల నిధులను మంజురు చేయడంపై పంచాయితీరాజ్ కమీషనర్ డా.శరత్‌ను ఎన్నికల సంఘం మందలించింది. వెంటనే నివేదిక పంపాలని పంచాయితీ రాజ్ సెక్రటరీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2021-12-08T19:05:39+05:30 IST