పెరిగిపోతున్న కరోనా కేసులు.. సంక్రాంతి తర్వాత తెలంగాణలో ఆంక్షలు!

ABN , First Publish Date - 2022-01-08T18:20:23+05:30 IST

కరోనా కేసుల పెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే చర్యలకు..

పెరిగిపోతున్న కరోనా కేసులు.. సంక్రాంతి తర్వాత తెలంగాణలో ఆంక్షలు!

హైదరాబాద్ : కరోనా కేసుల పెరుగుదలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఆంక్షలు విధించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో అధికారుల నుంచి సీఎం కేసీఆర్ నివేదిక కోరారు. ప్రస్తుతం రోజుకు 2500 పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత, నియంత్రణపై ఇవ్వాళ కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు.


రాష్ట్రంలో వచ్చే మూడు వారాలు అత్యంత కీలకంగా ప్రభుత్వం భావిస్తోంది. కేసుల తీవ్రత, మరణాల సంఖ్య పెరిగితే ఆంక్షలు తప్పవని.. అధికారులు చెబుతున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది. అలాగే బార్లు, పబ్‌లు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-08T18:20:23+05:30 IST