Warning : తెలంగాణలో Mask లేకపోతే భారీగా ఫైన్

ABN , First Publish Date - 2021-12-02T20:22:56+05:30 IST

ఒమైక్రాన్ వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది...

Warning : తెలంగాణలో Mask లేకపోతే భారీగా ఫైన్

హైదరాబాద్ : ఒమైక్రాన్ వేరియంట్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం డిహెచ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఒమిక్రన్ ఇప్పటికే వ్యాప్తి ఎక్కువగా ఉందని.. ఇప్పటికే 25 దేశాలు నుంచి కేసులు వస్తున్నాయని వెల్లడించారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా జనాలు తిరిగితే వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని డీహెచ్ హెచ్చరించారు. ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని పోలీస్‌ శాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరోవైపు.. వాక్సిన్ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్లేనని.. రాష్ట్ర ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. డిసెంబర్ చివరికల్లా రాష్ట్రంలో వాక్సినేషన్ పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలు కూడా తమ వంతుగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.


ఇక అన్నీ బంద్..!

ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి వచ్చిన 320 మందికి బుధవారం రోజు టెస్టులు చేయగా.. బ్రిటన్ నుంచి వచ్చిన ఒక మహిళకు పాజిటివ్ వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళను టిమ్స్ ఆస్పత్రికి పంపినట్లు శ్రీనివాస్ మీడియా వెల్లడించారు. కాగా.. మళ్లీ ఆంక్షలు విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ట్యాంక్‌బండ్, చార్మినార్ దగ్గర సండే- ఫన్ డే నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మాల్స్, పబ్‌లు, మార్కెట్లలో కరోనా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలొచ్చాయి. అంతేకాదు.. స్కూల్స్, కాలేజీల్లో పరిస్థితులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Updated Date - 2021-12-02T20:22:56+05:30 IST