న్యూఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయండి.. పార్టీలు చేసుకోండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

ABN , First Publish Date - 2021-12-30T18:19:51+05:30 IST

కోవిడ్ వల్ల మృతి చెందిన కుటుంబాలకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..

న్యూఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయండి.. పార్టీలు చేసుకోండి: తెలంగాణ హెల్త్ డైరెక్టర్

తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు హైకోర్టు న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తే శ్రీనివాస్ మాత్రం బాగా ఎంజాయ్ చేయమంటున్నారు. పార్టీలు చేసుకోమంటున్నారు.  


హైదరాబాద్:  కోవిడ్ వల్ల మృతి చెందిన కుటుంబాలకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. నిన్న ఒక్క రోజే అమెరికాలో 4లక్షలు, యూకేతో పాటు పలు దేశాల్లో లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. 130 దేశాకు కొత్త కోవిడ్ వేరియంట్ పాకిందని శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కోవిడ్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. డెల్టా వేరియంట్ కంటే 30 రేట్లు వేగంగా విస్తరిస్తోందనే మాటలు వినిపిస్తున్నాయని శ్రీనివాస్ పేర్కొన్నారు.


ఇంకా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘థర్డ్ వేవ్ ప్రారంభం అయిందని అనుకోవచ్చు. ఒమైక్రాన్ వ్యాధి లక్షణాలు 90శాతం మందిలో కనిపించడం లేదు. లక్షణాలు లేని వ్యక్తిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త వేరియంట్ ముప్పు నుంచి వ్యాక్సిన్ వేసుకుంటే తప్పించుకోవచ్చు. వచ్చే సంక్రాంతి థర్డ్ వేవ్‌కు ప్రారంభం. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. న్యూఇయర్ వేడుకలను ఎంజాయ్ చేయండి. పార్టీలు చేసుకోండి. రాబోయే రోజుల్లో టెస్టుల సంఖ్య పెంచబోతున్నాం. గత రెండు రోజుల నుంచి కోవిడి పాజిటివ్ రేటు పెరుగుతోంది. గతంలో ఉన్న కోవిడ్ చికిత్సనే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. ఎలాంటి మార్పులు లేవు. థర్డ్ వేవ్ కొవిడ్‌కు అంతం అని చెప్పుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-12-30T18:19:51+05:30 IST