TS High Court: పోడు భూములపై జీవో 140పై టీఎస్ హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-09-23T20:15:08+05:30 IST

పోడు భూములపై ప్రభుత్వం తెచ్చిన జీవో 140పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

TS High Court: పోడు భూములపై జీవో 140పై టీఎస్ హైకోర్టులో విచారణ

హైదరాబాద్ (Hyderabad): పోడు భూములపై ప్రభుత్వం తెచ్చిన జీవో 140పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను శంకర్‌నాయక్, అంజీ, మీక్యా నాయక్ దాఖలు చేశారు. అలాగే  పోడు భూములపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఆ జీవోలో ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అయితే సర్కార్ తీసుకొచ్చిన జీవో చట్ట పరిధిలో లేదని పిటిషనర్లు తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కమిటీ ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 140 చట్ట పరిధిలో లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని న్యాయస్థానం పేర్కొంటూ.. తదుపరి విచారణ అక్టోబర్ 21కి వాయిదా వేసింది.

Updated Date - 2022-09-23T20:15:08+05:30 IST