న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలపై టీ హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-12-23T16:50:05+05:30 IST

కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది.

న్యూ ఇయర్, క్రిస్మస్ వేడుకలపై టీ హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఒమైక్రాన్ వైరస్ తీవ్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలు, క్రిస్మస్ వేడుకలకు ఆంక్షలు విధించాలని  న్యాయస్థానం తెలిపింది. జనం గుంపులు గుంపులుగా గుమి గూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో ప్రభుత్వం  స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు  పేర్కొంది. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయలని ధర్మాసనం ఆదేశించింది. 




రాష్ట్రాన్ని ఒమైక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. రోజురోజుకూ ఒమైక్రాన్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 38 ఒమైక్రాన్ కేసుల నమోదు అయ్యాయి. ఒమైక్రాన్ కేసులలో తెలంగాణ నాల్గవ స్థానంలో నిలిచింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విదేశీ రాకపోకలు ఎక్కువగా ఉండటమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. నిన్న ఒక్కరోజే 14 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు వైరస్ బాధితుల్లో 6 రిస్క్ దేశాల నుంచి, 31 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి రాగా... మరొకరు కాంటాక్ట్ వ్యక్తి వైరస్ సోకింది. కాంటాక్ట్ వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. వచ్చిన కేసులు ఎక్కువగా టోలిచౌకి, పారామౌంట్ నుంచే ఉన్నారు. ఒమైక్రాన్‌కు హైదరాబాద్‌ హాట్ స్పాట్‌గా నిలుస్తోంది. 

Updated Date - 2021-12-23T16:50:05+05:30 IST