నటి సాయిపల్లవి పిటిషన్‌ను కొట్టివేసిన Telangana High Court

ABN , First Publish Date - 2022-07-08T03:04:43+05:30 IST

Hyderabad: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నటి సాయిపల్లవి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. భజరంగ్‌దళ్‌ సభ్యుడి ఫిర్యాదుతో జూన్‌లో సుల్తాన్‌బజార్‌ పోలీసులు

నటి సాయిపల్లవి పిటిషన్‌ను కొట్టివేసిన Telangana High Court

Hyderabad: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నటి సాయిపల్లవి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. భజరంగ్‌దళ్‌ సభ్యుడి ఫిర్యాదుతో జూన్‌లో సుల్తాన్‌బజార్‌ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి జూన్‌ 21న నోటీసు పంపారు. ఆ నోటీసు  రద్దుచేయాలని సాయిపల్లవి హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఆమె అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. 

ఏమిటీ ఆ వివాదాస్పద వ్యాఖ్యలు

కాశ్మీర్ పండిట్ల హత్యలు, గో హత్యల గురించి ఇటీవల సాయిపల్లవి మాట్లాడారు. ‘‘కొన్ని రోజుల క్రితం కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా వచ్చింది. అందులో కాశ్మీర్ పండిట్లను ఎలా చంపారు అని చూపించారు. మనం వాటిని మత సంఘర్షణలా చూస్తున్నాం. రీసెంట్‌గా ఒక బండిలో ఆవుని తీసుకెళ్తున్నారు. అందులో డ్రైవర్ ముస్లిం అతను. కొంత మంది అతన్ని కొట్టి జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది. మతాలు కాదు.. మనం మంచి వ్యక్తిగా ఉంటే, ఇతరులను బాధించకుండా ఉంటే.. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మంచిగానే ఉంటుంది” అని సాయిపల్లవి పేర్కొంది. 

ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి  సోషల్ మీడియాలో పలువురు వేర్వేరుగా స్పందించారు. సాయిపల్లవి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. మరికొందరు కశ్మీరీ పండిట్స్‌ను గోవుల అక్రమ రవాణా చేసిన వారితో పోల్చడమేంటని మండిపడ్డారు.

Updated Date - 2022-07-08T03:04:43+05:30 IST