Telanganaలో కొనసాగుతున్న అక్రమకట్టడాల కూల్చివేత

ABN , First Publish Date - 2022-01-18T18:03:46+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా అక్రమ కట్టడాల కూల్చివేత స్పెషల్ డ్రైవ్ రెండో రోజు కొనసాగుతోంది.

Telanganaలో కొనసాగుతున్న అక్రమకట్టడాల కూల్చివేత

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అక్రమ కట్టడాల కూల్చివేత స్పెషల్ డ్రైవ్ రెండో రోజు కొనసాగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అక్రమకట్టడాల కూల్చివేతపై మున్సిపల్ యంత్రాంగం వేగం పెంచింది. జవహర్ నగర్ పరిధిలో అక్రమ కట్టడాలను సిబ్బంది కూల్చివేశారు. అటు బాలాజీ నగర్‌లోని పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.  హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.  పోలీసు బందోబస్తుతో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. 

Updated Date - 2022-01-18T18:03:46+05:30 IST