శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ నంబర్‌వన్‌

ABN , First Publish Date - 2022-09-25T05:30:00+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ నంబర్‌వన్‌
మర్కుక్‌ మండలంలో పోలీస్‌ కాంప్లెక్సును ప్రారంభిస్తున్న మంత్రులు, అధికారులు

హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ 

పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేశాం

 ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు


జగదేవ్‌పూర్‌, సెప్టెంబరు 25: శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండల కేంద్రంలో రూ.24 కోట్లతో నిర్మించిన పోలీస్‌ కాంప్లెక్సులో ఎస్సై క్వార్టర్‌, డాగ్‌ కన్నెల్‌, ఆఫీసర్స్‌ గెస్ట్‌హౌజ్‌, విశ్రాంతి బ్యారక్స్‌, ఇంటర్నల్‌ సీసీ రోడ్లు, ఆఽధునిక టెక్నాలజీతో యూపీఎస్‌ సిస్టం, సిబ్బంది క్వార్టర్స్‌, బీడీ టీం భవనాలను మంత్రి హరీశ్‌రావు, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారనే అపోహాను ప్రచారం చేశారని, కానీ ఎనిమిదేళ్లలో అంచనాలను తలకిందులు చేసి దేశంలోనే ఆదర్శవంతమైన పోలీసింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆయన చెప్పారు.  మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. పోలీస్‌ వ్యవస్థను అన్ని విధాల పటిష్టం చేశామని, సిబ్బందిని నియమించామన్నారు. కొత్త మండలాల్లో పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి, ఫ్రేండ్లీ పోలీసింగ్‌కు కృషి చేస్తున్నామని తెలిపారు. 


 కేసీఆర్‌ వచ్చాక బతుకులు మారాయి

వర్గల్‌ : బతుకమ్మ పండుగ రోజున డబుల్‌ బెడ్‌రూం గృహప్రవేశాలు చేయించడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం వర్గల్‌ మండలం తునికిఖాల్సాలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడంతో పాటు లబ్ధిదారులతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో గృహాల కోసం ఇచ్చిన డబ్బు బేస్మెంట్‌కు కూడా సరిపోలేదన్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న విజయరామరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి ఉన్నప్పడు మీ బతుకులు మారలేదని, సీఎం కేసీఆర్‌ వచ్చిన తర్వాత గజ్వేల్‌ ప్రజల బతుకులు మారాయన్నారు. బీజేపీ నేతలకు మాటలు ఎక్కువ చేతలు తక్కువన్నారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడైనాఉన్నాయా? అని ప్రశ్నించారు. అనంతరం హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలో వచ్చాక రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, అన్ని మతాల వారు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలపై సీఎం కేసీఆర్‌కు నియత్తు ఉంది కాబట్టే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటీల్‌, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీటీసీ బాలు యాదవ్‌, ఎంపీపీ లత రమేశ్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ బాల్‌రెడ్డి, సర్పంచ్‌ సంధ్యా జానీ, ఎంపీటీసీ జనార్ధన్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు సంతోష వెంకటేశ్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకటేశ్‌, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 


రాష్ట్రాభివృద్ధి టీఆర్‌ఎ్‌సకే సాధ్యం

 ములుగు: రాష్ర్టాభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ములుగు మండలం తునికి బొల్లారంలో రూ.6కోట్లతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తునికి బొల్లారం నుంచి అచ్చాయిపల్లి దాసరపల్లి  మీదుగా శామిర్‌పేట మండలం యాడారం వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అన్ని కుటుంబాలకు సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, జడ్పీటీసీ జయమ్మ అర్జున్‌గౌడ్‌, ఎంపీపీ లావణ్య అంజన్నగౌడ్‌, డీసీసీబీ డైరెక్టర్‌ బట్టు అంజిరెడ్డి, సర్పంచ్‌ పావని జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ కుక్కల నరే్‌షగౌడ్‌, మండల ప్రధాన కార్యదర్శి  కుక్కల బాబు గౌడ్‌, ఉపసర్పంచ్‌ నర్సింహులుగౌడ్‌ చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు పాల్గొన్నారు.


సిద్దిపేటకు బీ ఫార్మసీ కళాశాల

- నేడు రామంచ వద్ద   శంకుస్థాపన చేయనున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటటౌన్‌, సెప్టెంబరు 25: సిద్దిపేట మెడికల్‌ హబ్‌  దిశగా అడుగులు వేస్తున్నది. సిద్దిపేటకు బీ ఫార్మసీ కళాశాల మంజూరు కాగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ కమిటీ సహకారంతో కళాశాల భవనాన్ని నిర్మించనున్నారు. ఈ కళాశాలను చిన్నకోడూరు మండలం రామంచ వద్ద దాదాపు  రూ. 26.2కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు. అందుకు నేడు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కళాశాలను మూడు అంతస్థుల్లో నిర్మించనున్నారు. వచ్చే ఏడాది బీ ఫార్మసీలో 100 సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించనున్నారు. రూ.21.4 కోట్లతో కళాశాల భవనం, రూ. 3.81 కోట్లతో హాస్టల్‌, రూ.50లక్షలతో రోడ్లు, ఇతర సౌకర్యాలను కల్పించనున్నారు. కళాశాల భవనానికి రంగనాయక స్వామి కళాశాలగా నామకరణం చేశారు. 

Updated Date - 2022-09-25T05:30:00+05:30 IST