హరిత, నీలి విప్లవాల లోగిలి తెలంగాణ

ABN , First Publish Date - 2022-10-02T04:49:04+05:30 IST

తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌ ఈ ప్రాంతానికి హరిత, నీలి విప్లవాన్ని అందిస్తున్నారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

హరిత, నీలి విప్లవాల లోగిలి తెలంగాణ
దుబ్బాకలోని పెద్దచెరువులో చేప విత్తనాలను పోస్తున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డి

కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంలో పచ్చనిపల్లెలు 

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక, అక్టోబరు 1: తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌ ఈ ప్రాంతానికి హరిత, నీలి విప్లవాన్ని అందిస్తున్నారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.  మనరాష్ట్రంలో పండుతున్న ధాన్యం, చేపలు పక్క రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. శనివారం దుబ్బాకలోని పెద్దచెరువులో డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ గుండవేని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేప విత్తనాలను పోశారు. మండలంలోని పెద్దగుండవెల్లి గ్రామంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సద్ది రాజిరెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులు టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడువారిన పల్లెల్లో ఇప్పుడు జలకళ సంతరించుకున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ భగీరథ ప్రయత్నంలో తెలంగాణ దేశంలోనే ధాన్య సంపదలో ముందున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ పుష్పలత, దుబ్బాక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనితాభూంరెడ్డి తదితరులున్నారు. 

అబద్ధాలతో గద్దెనెక్కిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే

తొగుట, అక్టోబరు 1: అబద్ధాలు చెప్పి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీజేపీ నాయకుడి అసలు రంగు ఏడాదిన్నరలో ప్రజలు గ్రహించారని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తొగుల మండలం వర్ధరాజ్‌పల్లిలో శనివారం సాయంత్రం తొగుటకు చెందిన కాంగ్రెస్‌ మండల ప్రధాన కార్యదర్శి రేపాక విష్ణు, బీసీ సెల్‌ మండల ఉపాధ్యక్షుడు గోరిమెల్ల గణేష్‌, మాలమహనాడు నాయకులు అనుమెల్ల అబ్బి, కాసర్ల యాదగిరి, బీసీ సెల్‌ గ్రామ ఉపాధ్యక్షుడు బండారు అశోక్‌, బీసీ సెల్‌ కార్యదర్శి బండారు స్వామి, సీత మధు, బండారు మల్లేశం, చింత అజయ్‌, వర్ధరాజ్‌పల్లికి చెందిన బీజేపీ నాయకులు జయరాంరెడ్డి, మండల కమలాకర్‌, ఉప్పరి కనకరాజు, నర్సింహులు ఎంపీ సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. అనంతరం గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించ తలపెట్టిన ముదిరాజ్‌ సంఘం, రెడ్డి సంఘం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గోవర్ధనగిరిలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ దుబ్బాక కనకయ్యను ఎంపీ శాలువా కప్పి సన్మానించారు. అలాగే చందుకు రూ.60 వేలు, జయరాంరెడ్డికి రూ.36 వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. పెద్దమాసాన్‌పల్లి వడ్డెర సంఘం భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాజవ్వమల్లయ్య, పార్టీ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. 

మర్పడగ క్షేత్రం మహిమాన్వితం: ఎంపీ 

కొండపాక, అక్టోబరు 1: మర్పడగ  క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జునస్వామి క్షేత్రాన్ని శనివారం రాత్రి సందర్శించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయ దుర్గామాతను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా క్షేత్ర వ్యవస్థాపకుడు చెప్పెల హరినాథశర్మ ఎంపీని శేష వస్ర్తాలతో సత్కరించారు. గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఎంపీటీసీ ఆంజనేయులు, ఉపసర్పంచ్‌ యాదగిరి ఉన్నారు. 

Updated Date - 2022-10-02T04:49:04+05:30 IST