ఆరేళ్ల అసమర్థ పాలనకు చరమగీతం పాడాలి: కోదండరాం

ABN , First Publish Date - 2021-03-06T19:21:27+05:30 IST

ఆరేళ్ళ అసమర్థ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు.

ఆరేళ్ల అసమర్థ పాలనకు చరమగీతం పాడాలి: కోదండరాం

నల్లగొండ: ఆరేళ్ళ అసమర్థ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ అమలు లేదని, రైతుల ఋణాలు మాఫీ కాలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఊసే లేదని మండిపడ్డారు. ఆస్తులు పెంచుకోవడం తప్ప, అభివృద్ధి జాడే లేదని విమర్శించారు. ఉద్యమ కారులకు కనీస గుర్తింపు లేదన్నారు. అధికార పార్టీ నేతలు పట్టభద్రులను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక దందాలు, భూ కబ్జాలు, అవినీతే ఎజెండాగా టీఆర్ఎస్ నాయకులు పనిచేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. పట్టభద్రులు ఇచ్చే తీర్పు టీఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టు కావాలని కోదండరాం పేర్కొన్నారు. 

Updated Date - 2021-03-06T19:21:27+05:30 IST