రూ.1.65 లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-04-18T05:39:56+05:30 IST

మండలంలోని సంతగుడిపాడు సమీపంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న రూ.1.65 లక్షల తెలంగాణ మద్యాన్ని పోలీసులు శనివారం తెల్లవారు జామున పట్టుకున్నారు.

రూ.1.65 లక్షల తెలంగాణ మద్యం స్వాధీనం
పట్టుబడిన మద్యంతో ఎస్‌ఐ హజరత్తయ్య

రొంపిచర్ల, ఏప్రిల్‌ 17: మండలంలోని సంతగుడిపాడు సమీపంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న రూ.1.65 లక్షల తెలంగాణ మద్యాన్ని పోలీసులు శనివారం తెల్లవారు జామున పట్టుకున్నారు. ఇద్దర్ని అదుపులోకి తీసుకుని, లారీని స్వాధీనం చేసుకున్నారు. 95  ఫుల్‌, 594 క్వార్టర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ హజరత్తయ్య తెలిపారు.  

  

Updated Date - 2021-04-18T05:39:56+05:30 IST