America: మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం

Published: Sun, 20 Mar 2022 13:23:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
America: మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం

లాస్‌ఏంజిల్స్‌: ఏడు రోజుల పర్యటన కోసం మంత్రి కేటీఆర్ అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చే ఏకైక లక్ష్యంతో మంత్రి యూఎస్‌లో పర్యటిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన కేటీఆర్‌.. ఆదివారం తెల్లవారుజామున(అమెరికా కాలమానం ప్రకారం) లాస్‌ ఏంజిల్స్‌ చేరుకున్నారు. దీంతో లాస్‌ ఏంజిల్స్‌లో మంత్రి కేటీఆర్‌కు ఎన్నారైలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నారైలతో కొద్దిసేపు మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర అభివృద్ధి విషయమై వారితో చర్చించారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మనఊరు-మనబడి' కార్యక్రమాన్ని వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఎన్నారైలకు పిలుపునిచ్చారు. అలాగే అగ్రరాజ్యంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన బిడ్డలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ కోరారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.