TS news: ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ మంత్రులు

ABN , First Publish Date - 2022-09-07T16:09:25+05:30 IST

సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను మంత్రులు తలసాని,

TS news: ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ మంత్రులు

హైదరాబాద్: సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం (NTR stadium) లో ఏర్పాట్లను మంత్రులు తలసాని (Talasani srinivas yadav), శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud), సత్యవతి రాథోడ్ (Satyavati rathod), మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (gadwala vijayalaxmi), ఇతర అధికారులు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... సెప్టెంబర్ 17న పీవీ రోడ్ నుంచి భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నట్లు చెప్పారు. 1948 హైదరాబాద్ విలీనం తరువాత 75 సంవత్సరాల సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 


మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... పచ్చబడ్డ ప్రాంతన్ని రక్తపాతం పరేలా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో అన్ని వర్గాల వారు బాగుపడ్డారన్నారు. 


మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... ఈ సభలో లక్షలాది గిరిజనులు హాజరవుతారని తెలిపారు. గిరిజనుల భవన్ ప్రారంభం తరువాత గిరిజనులు ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియంకు వస్తారన్నారు. గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేబినెట్‌లో తీర్మానం చేశామని అన్నారు. 

Updated Date - 2022-09-07T16:09:25+05:30 IST