TS News: తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసుల వేట

ABN , First Publish Date - 2022-08-21T15:39:15+05:30 IST

తాడ్వాయి ఎన్ కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.

TS News: తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసుల వేట

ములుగు జిల్లా (Mulugu Dist.): తాడ్వాయి ఎన్ కౌంటర్‌ (Encounter)లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. తాడ్వాయి, ఏటూరు నాగారం, కొత్తగూడ, గంగారం, బయ్యారం అడవుల్లో కూంబింగ్ (Combing) నిర్వహిస్తున్నారు. ఏజెన్సీలోని ఆదివాసి గూడాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మాజీ మావోయిస్టులపై పోలీసులు నిఘా పెట్టారు. దీంతో ఏజన్సీ గిరిజన గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి. ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులపై పోలీసులు రివార్డ్ ప్రకటించారు. 8 మంది మావోయిస్టులపై రూ. 5 లక్షల నుంచి ఇరవై లక్షల వరకు రివార్డ్ ప్రకటించారు. తప్పించుకున్న మావోయిస్టుల ఫైల్ ఫోటోలు విడుదల చేశారు.

Updated Date - 2022-08-21T15:39:15+05:30 IST