ఎలక్ట్రిక్ బైకుల కంపెనీ డీలర్‌షిప్‌ పేరుతో ఘరానా మోసం

ABN , First Publish Date - 2022-07-07T02:10:28+05:30 IST

ఎలక్ట్రిక్ బైకుల కంపెనీ డీలర్‌షిప్‌ పేరుతో దుండగులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఇంటర్నెట్‌లో అథర్ ఎనర్జీ డీలర్‌షిప్‌ అంటూ ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఎలక్ట్రిక్ బైకుల కంపెనీ డీలర్‌షిప్‌ పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్: ఎలక్ట్రిక్ బైకుల కంపెనీ డీలర్‌షిప్‌ పేరుతో దుండగులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఇంటర్నెట్‌లో అథర్ ఎనర్జీ డీలర్‌షిప్‌ అంటూ ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.  డీలర్‌షిప్‌పై సికింద్రాబాద్ సీతాఫల్‌మండికి చెందిన బాధితుడు స్పందించాడు. అథర్ ఎనర్జీ డీలర్‌షిప్‌ ఇస్తామని సైబర్ నేరగాడు ఫోన్ చేశాడని, డీలర్‌షిప్‌తో కింద రూ.12.50లక్షలు వసూలు చేసినట్లు వాపోయాడు. నగదు ఖాతాలోకి పడిన తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చిందన్నారు. ఆ తర్వాత బెంగళూరులో అథర్ ఎనర్జీ కంపెనీకి బాధితుడు వెళ్ళాడు. మోసానికి పాల్పడింది సైబర్ నేరగాళ్ళని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో బాధితుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2022-07-07T02:10:28+05:30 IST