బర్త్‌డే వేడుకల్లో విషాదం

ABN , First Publish Date - 2022-05-14T23:04:13+05:30 IST

బర్త్‌డే వేడుకల్లో విషాదం

బర్త్‌డే వేడుకల్లో విషాదం

ఖమ్మం: నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌లో బర్త్‌డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బర్త్‌డే కేక్‌ కట్‌ చేసేందుకు భరత్‌  అనే యువకుడు స్నేహితులతో కలిసి వచ్చాడు. చేతులు కడుక్కునేందుకు నీటిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తూ మునిగి భరత్‌ (19) మృతి చెందాడు9. మృతుడు తనికెళ్ల వాసి భరత్‌ గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Read more