నగ్నంగా నిలబెట్టి చితకబాదారు

ABN , First Publish Date - 2022-05-05T13:53:59+05:30 IST

నగ్నంగా నిలబెట్టి చితకబాదారు

నగ్నంగా నిలబెట్టి చితకబాదారు

ఆపై సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరణ..

హైదరాబాద్‌లో చిన్నారులపై అమానుషం


హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవులను సరదాగా ఆడుకుంటూ గడుపుతు న్న 16 మంది చిన్నారులపై ముగ్గురు వ్యక్తులు అమానుషానికి పాల్పడ్డారు. బాధిత బాలలం తా 8-12 ఏళ్ల లోపు వయసున్న వారే. వారి గుడ్డలు ఊడదీసిన నిందితులు.. పిరుదులపై, వీపుపై కర్రతో చితకబాదారు. హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న మంగళ్‌హాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుల్లో ఒకరు ఎమ్మెల్యే పీఏ వద్ద పనిచేసే వ్యక్తి కావడంతో.. కేసును నీ రుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసు లు, బాధితుల తల్లిదండ్రుల కథనం ప్రకారం..  గుఫానగర్‌కు చెందిన 16 మంది చిన్నారులు ఇటీవలస్థానికంగా ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చి ‘‘నల్లగుట్ట దగ్గర ఆడుకోండి. ఆటోలో దింపుతా’’ అంటూ వారిని గుట్టపైకి తీ సుకెళ్లాడు. అప్పటికే గుట్టపై ఉన్న ఆమోజ్‌ (18), రాహుల్‌(19).. మరో బాలుడు కలిసి.. ఆ చిన్నారులను బెదిరించారు. వారి బట్టలు ఊడదీయించి.. కర్రతో చితకబాదారు. విషయాన్ని ఎవరికైనా చెబితే.. మళ్లీ కొడతామని బెదిరించారు. దాంతో చిన్నారులెవరూ విషయాన్ని వా రి తల్లిదండ్రులకు చెప్పలేదు. మంగళవారం చిన్నారులు స్నానం చేసే సమయంలో.. వారి వీపు, పిరుదులపై కమిలిపోయిన గాయాలున్న ట్లు కొందరు తల్లిదండ్రులు గుర్తించారు. దాంతో చిన్నారులు జరిగిన దారుణాన్ని వారికి వివరించారు. ఈ అమానుషంపై ఆరుగురు బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత హడావుడి చేసిన పోలీసులు.. ఆ తర్వాత కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుని, సీ ఆర్పీసీ సెక్షన్‌ 41 కింద నోటీసులు ఇచ్చి, పంపివేశారు. పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ పీఏ గా చెప్పుకొనే ఓ వ్యక్తి ఒత్తిడి ఉందనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఆ వ్యక్తి వద్ద ఆమోజ్‌ ప నిచేస్తాడని, అందుకే పోలీసులతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేశారంటున్నారు. నిజానికి మంగళవారం రోజునే ఎవరూ ఫిర్యాదు చేయకుండా ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. బుధవారం ఈ అమానుషానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో.. తూతూమంత్రంగా నిందితులను పిలిపించి, నో టీసులు ఇచ్చి, చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. సీరియస్‌ నేరా న్ని పోలీసులు తేలిగ్గా తీసుకుని, జువైనల్‌ చ ట్టంలోని బెదిరించడం, కొట్టడం వంటి సెక్షన్ల కింద మాత్రమే కేసు నమోదు చేశారు. కాగా.. నిందితులు ఆమోజ్‌, రాహుల్‌ చిల్లరగా తిరుగుతుంటారని, తమపై రౌడీషీట్‌ ఓపెన్‌ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ అమానుషానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. బస్తీలో తామంటే అంతా భయపడాలంటే రౌడీషీట్‌ ఒక్కటే మార్గమని భావిస్తూ,  స్థానికులతో తరచూ గొడవలకు దిగుతుంటారని తెలిపారు.


ఈ ప్రశ్నలకు బదులేది?


1. చిన్నపాటి గొడవలైనా ఐపీసీ సెక్షన్‌ 323 కింద కేసులు పెట్టే పోలీసులకు.. చిన్నారులకు కర్రతో కొడితే కమిలిపోయేలా గాయాలైనా సీరియ్‌సగా ఎందుకు తీసుకోలేదు?

2. జువైనల్‌ చట్టంపై కేసు నమోదు చేసిన పోలీసులకు.. చిన్నారులపై అత్యాచార నిరోధక చట్టం(పోక్సో) గురించి తెలియదా? గుడ్డలూడదీసి, నగ్నంగా నిలబెట్టి కొడితే.. పోక్సో చట్టాన్ని ఎందుకు ప్రయోగించలేదు?

3. చిన్నారులను గుడ్డలూడదీసి కొట్టడమే కాకుండా.. సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించారు. దీనిపై ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) చట్టం కింద కేసు పెట్టొచ్చని తెలియదా? ఆ వీడియో చైల్డ్‌ పోర్నోగ్రఫీ, చైల్డ్‌ అబ్యూజ్‌ పరిధిలోకి రాదా?

4.  ఎమ్మెల్యే పీఏ వద్ద పనిచేసే వ్యక్తి కావడం వల్లే.. బెయిలబుల్‌ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారా?

Read more