సనత్‌నగర్‌లోని జింకలవాడ బస్తీలో దారుణం

Published: Sun, 26 Jun 2022 19:07:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లోని జింకలవాడ బస్తీలో దారుణఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై యువకులు కారు ఎక్కించారు. ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. యువకులు పరారీలో ఉన్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.