బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

ABN , First Publish Date - 2022-08-09T13:27:46+05:30 IST

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు అల్పపీడనం పయనిస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వానలు కురిచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే నేడు ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నట్లు అధికారులు తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Updated Date - 2022-08-09T13:27:46+05:30 IST