రాయితీపై ‘మహాత్ముడి’ ఆత్మకథ

ABN , First Publish Date - 2022-08-18T14:33:22+05:30 IST

రాయితీపై ‘మహాత్ముడి’ ఆత్మకథ

రాయితీపై ‘మహాత్ముడి’ ఆత్మకథ

హైదరాబాద్‌ సిటీ: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో అరుదైన పుస్తకాలు లభ్యమవుతున్నాయి. ప్రగతి పబ్లికేషన్స్‌ స్టాల్‌లో మహాత్మా గాంధీ ఆత్మకథ ‘సత్యశోధన’ పుస్తకంపై 25 శాతం రాయితీ ఇస్తున్నారు. అనల్ప ప్రచురించిన రూ.2,175 విలువైన 15 పుస్తకాలను తొలి 75 మందికి రూ.550కే ఇవ్వనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కేవలం 75 సెట్స్‌పై మాత్రమే ఈ తగ్గింపు ధర వర్తిస్తుందని తెలిపారు. ఈ రాయితీ కూడా 22-08-2022 వరకు మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పోస్టల్ చార్జీలు రూ. 100 అదనం అని గుర్తుచేశారు. నవ తెలంగాణ, ప్రజాశక్తి, ఎమెస్కో, పల్లవి, నవచేతన తదితర పుస్తక స్టాళ్లలో స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రల పుస్తకాలపై ప్రత్యేక రాయితీ ఇస్తున్నట్లు ప్రచురణ కర్తలు తెలిపారు.



అనల్ప ప్రచురించిన రూ.2,175 విలువైన 15 పుస్తకాలు ఇవే..

1. అద్దాల గదులు – 100/

2. భోజ-సాలభంజికల కథలు - 125/

3. గ్రహాంతరవాసి – 100/

4. హేమమాలి - 225/

5. మాళవిక - 100/

6. మహామంత్రి – 50/

7. మానస తరంగిణి -- 100/

8. మౌనసుందరి - 175/

9. నాయిక -- 120/

10. శకుంతల - 125/

11. డిసెంబర్ పూలు – 175/

12. ప్రేమకథలు -150/

13. తెలుగు కవుల అపరాధాలు -- 80/

14. ఇంటిపేరు ఇంద్రగంటి - 200/

15. రఫీ - 350/



గాడ్సేను సమర్థించడం బాధాకరం : అడపా 

స్వాతంత్ర్యోద్యమ కాంక్షను సామాన్యుల వద్దకు తీసుకెళ్లడంలో మహాత్మాగాంధీ అనుసరించిన విధానం ఆదర్శనీయమని ఆచార్య అడపా సత్యనారాయణ అన్నారు. ఎల్బీ స్టేడియంలోని వజ్రోత్సవ పుస్తక ప్రదర్శనలో బుధవారం ఆయన ‘తెలంగాణలో గాంధీ’ అంశంపై ప్రసంగించారు. అడపా సత్యనారాయణ మాట్లాడుతూ తిలక్‌ స్వరాజ్య నిధి సేకరణ, అస్పృశ్యతా నివారణోద్యమం తదితర సందర్భాల్లో బాపూజీ హైదరాబాద్‌ సందర్శించిన సంగతులను గుర్తుచేశారు. నేటి పరిస్థితుల్లో గాడ్సేను సమర్థించే వ్యక్తులు తయారవ్వడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ సలహాదారు గోనారెడ్డి, హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T14:33:22+05:30 IST