లారీ క్యాబిన్‌లోనే గుండెపోటుతో డ్రైవర్ మృతి

Dec 8 2021 @ 19:08PM

నల్గొండ: జిల్లాలోని నార్కట్ పల్లి వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. లారీ నడుపుతుండగా లారీ డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. గుండెపోటును గమనించిన లారీ డ్రైవర్ లారీ పక్కకు నిలిపివేశాడు. వెంటనే ఆ క్యాబిన్‌లోనే కుప్పకూలిన డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు గుంటూరు జిల్లాకు చెందిన కాంతారావుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.