తాగిన మైకంలో వృద్ధరాలిని చంపిన యువకుడు

Dec 8 2021 @ 17:07PM

నల్లగొండ: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.  కొండ మల్లెపల్లి మండలం జేత్య తండాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో రవి అనే యువకుడు బంగారి అనే వృద్ధురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఆ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.   


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.