ఆదిలాబాద్: జిల్లాలో ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించింది. గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ వద్ద ఘటన చోటుచేసుకుంది. మగబిడ్డకు తల్లి రత్నమాల జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సులో పుట్టిన పసికందుకు ఆర్టీసీ కానుక ప్రకటించింది. పసికందుకు జీవితాంతం ఉచిత బస్పాస్ కానుక ఇవ్వనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.