తెలంగాణ టెన్త్ ఫలితాల డేట్ ఖరారు

ABN , First Publish Date - 2022-06-28T22:43:20+05:30 IST

తెలంగాణ టెన్త్ ఫలితాల డేట్ ఖరారు

తెలంగాణ టెన్త్ ఫలితాల డేట్ ఖరారు

హైదరాబాద్: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు డేట్ ఖరారైంది. జూన్ 30న ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు పదోతరగతి బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు కొన‌సాగిన విష‌యం తెలిసిందే. ఇవాళ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుదలయ్యాయి. 

Updated Date - 2022-06-28T22:43:20+05:30 IST