ఆటోను ఢీకొట్టిన మరో వాహనం

ABN , First Publish Date - 2021-12-08T22:30:37+05:30 IST

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్ స్టేడియం రోడ్డులో ముందు వెళ్తున్న వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలు ఉన్నారు

ఆటోను ఢీకొట్టిన మరో వాహనం

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉప్పల్ స్టేడియం రోడ్డులో ముందు వెళ్తున్న వాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలు ఉన్నారు. అందులో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-12-08T22:30:37+05:30 IST