లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బోనాలు

ABN , First Publish Date - 2020-07-07T03:41:10+05:30 IST

తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఇంటింటా బోనాలు, ప్రతి ఇంటా బోనాలు, లండన్

లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన బోనాలు

లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఇంటింటా బోనాలు, ప్రతి ఇంటా బోనాలు, లండన్ బోనాలు అంటూ లండన్‌లో బోనాల పండుగను ప్రారంభించింది. 2011లో మొదటి సారిగా లండన్‌‌లో  బోనాలు ప్రారంభం అయ్యాయని ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మీడియాతో తెలిపారు. అప్పటి నుంచి వివిధ సంఘాలు చేసే బోనాల కార్యక్రమంలో వేలాది మంది పాల్గొంటూ ఒకే చోట బోనాలు చేసుకొని, తొట్టెల ఊరేగింపు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ ఈ సంవత్సరం కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల బోనాల నిర్వహణను ఎవరి ఇండ్లలో వాళ్లు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరమ్ నిర్వహించే బోనాలు పూర్తి ఆచారాలు, పద్ధతులు, నిష్ఠతో ఏర్పాటు చేయడం ఆనవాయితీ అని మహిళా విభాగం కో-ఆర్డినేటర్లు మీనా అంతరి, శౌరీ గౌడ్, వాణి అనసూరి, సాయి లక్ష్మి, దివ్య, శిరీష ఆశ, సవితా జమ్ముల, సీతా లతా, అమృత, శ్వేతా, జయశ్రీ, శ్రీవాణి సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు. కుటుంబసభ్యులకు దూరంగా ఉన్నప్పటికి లండన్‌లో తామంతా సొంత కుటుంబసభ్యులుగా కలిసి బోనాలు ఎత్తడం, ఓడిబియ్యం పోసుకోవడం, దావత్ చేసుకోవడం చేస్తూ వస్తున్నామన్నారు. కరోనా నుంచి బయటపడ్డాక ఒడిబియ్యం అందరం ఒకేచోట వండుకొని పెద్ద కార్యక్రమం నిర్వహించనున్నట్టు మహిళా విభాగంలోని కో-ఆర్డినేటర్లు తెలిపారు. కాగా.. బోనాల పండుగ విశిష్టతపై లండన్ వేదికగా వర్చువల్ వీడియో కాల్ ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంటారు తెలిపారు.

Updated Date - 2020-07-07T03:41:10+05:30 IST