UAE: ఉపాధి కోసం ఎడారి దేశానికి.. 2నెలల్లోనే ఘోరం.. ప్రభుత్వ సాయం కోరుతున్న కుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2022-08-01T17:12:50+05:30 IST

ఆర్థిక కారణాల వల్ల అతడు ఉపాధి కోసం ఎడారి దేశం బాట పట్టాడు. సుమరు రెండు నెలల క్రితమే UAE వెళ్లి.. అక్కడ ఉద్యోగంలో చేరాడు. ఇంతలో దారుణం చోటు చేసుకుంది. వరదల్లో చిక్కుకుని అతడు ప్రాణాలు వదిలాడు. విషయం తె

UAE: ఉపాధి కోసం ఎడారి దేశానికి.. 2నెలల్లోనే ఘోరం.. ప్రభుత్వ సాయం కోరుతున్న కుటుంబ సభ్యులు

ఎన్నారై డెస్క్: ఆర్థిక కారణాల వల్ల అతడు ఉపాధి కోసం ఎడారి దేశం బాట పట్టాడు. సుమరు రెండు నెలల క్రితమే UAE వెళ్లి.. అక్కడ ఉద్యోగంలో చేరాడు. ఇంతలో దారుణం చోటు చేసుకుంది. వరదల్లో చిక్కుకుని అతడు ప్రాణాలు వదిలాడు. విషయం తెలియడంతో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మంచిర్యాల(Mancherial) జిల్లా, జన్నారం మండలంలోని మారుమూల గ్రామమైన చింతగూడ‌కు చెందిన ఉప్పు లింగారెడ్డి(35) ఆర్థిక కారణాల వల్ల ఉపాధి కోసం రెండు నెలల క్రితం యూఏఈ వెళ్లాడు. ఫుజైరహ్ సిటీ(Fujairah city)‌లో నివసిస్తూ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఇటీవల యూఏఈలో కురిసిన భారీ వర్షాలు కురవగా.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ వరదల్లో చిక్కుకుని శుక్రవారం రోజు లింగారెడ్డి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణ వార్త ఆదివారం కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. లింగారెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించడానికి ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. కాగా.. లింగారెడ్డికి భార్య శిరిష, తల్లి లక్ష్మీబాయ్ ఉన్నారు. 



యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అకాల భారీ వర్షాలు (Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. పుజైరా (Fujairah), షార్జా (Sharjah), రాస్‌ అల్ ఖైమాల (Ras Al-Khaimah)లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి వర్షాలు నమోదయ్యాయి. పుజైరాలో రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా 25.5సెం.మీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. గడిచిన 27ఏళ్లలో యూఏఈలో ఈస్థాయి వర్షపాతం ఎన్నడూ నమోదు కాలేదని అక్కడి వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా పొటెత్తిన వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.


Updated Date - 2022-08-01T17:12:50+05:30 IST