శాంతి, భద్రతల పరిరక్షణలో దేశానికే రోల్ మోడల్ తెలంగాణ Police నివేదిక

ABN , First Publish Date - 2022-06-11T22:12:21+05:30 IST

2014 సంవత్సరం జూన్ నెలలో నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్రం(telangana state) సుసంపన్నమైన చారిత్రక వారసత్వానికి మారుగా నిలించింది.

శాంతి, భద్రతల పరిరక్షణలో దేశానికే రోల్ మోడల్ తెలంగాణ Police నివేదిక

హైదరాబాద్: 2014 సంవత్సరం జూన్ నెలలో నూతన రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణా రాష్ట్రం(telangana state) సుసంపన్నమైన చారిత్రక వారసత్వానికి మారుగా నిలించింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణా  రాష్ట్రం ఆర్ధిక ప్రగతికి, అభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, పౌరులందరి భద్రతకు, రక్షణకు తెలంగాణ పోలీస్(telangana police) అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ఆశాఖ తన నివేదికలో వెల్లడించింది. కాస్మో పాలిటన్, మెట్రో పాలిటన్, గంగ – జమునా సమ్మిళిత సంస్కృతికి పేరుగాంచిన తెలంగాణా ఇప్పుడు పారిశ్రామిక, వ్యాపార, సేవా రంగాలలో విస్తృతంగా అంతర్జాతీయ పెట్టుబడులను, బహుళ జాతి సంస్థలను ఆకర్షిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న మౌలికసదుపాయాలు, పటిష్టమైన శాంతి, భద్రతల పరిస్థితి  ఇలాంటి దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రపంచ చిత్ర పటంలో తెలంగాణా రాష్ట్రానికి  ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని తెలిపింది. 


అంతర్జాతీయంగా పేరొందిన బహుళ జాతి కంపెనీలన్నీతెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరికొన్ని అదే దారిలో ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు, లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణా రాష్ట్ర పోలీసు విభాగం కూడా దిగువ తెలిపిన పౌర కేంద్రీకృత లక్ష్యాలను నిర్దారించుకొని అమలు చేస్తోంది.అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, ప్రగతికి సానుకూలమైన వాతావరణం   కల్పించడం ద్వారా ప్రజా భద్రత, రక్షణ ప్రమాణాలను ప్రోత్సహించడం. ప్రజల భద్రత, రక్షణ విషయంలో రాజీ పడితే, రాష్ట్ర ప్రగతి, ప్రజల అభివృద్ధి, పెట్టుబడుల కల్పన సాధ్యం కాదన్నది రాష్ట్ర ప్రభుత్వ విశ్వాసం.  


జూన్ 2014 లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఐదేళ్ళలో రాష్ట్ర పోలీసు విభాగం ఎన్నో క్రియాశీలక ప్రక్రియలకు, సాంకేతిక ప్రయోగాలకు చొరవ తీసుకున్నది.రాష్ట్ర ప్రజలకు తగిన రక్షణ, భద్రత కల్పించే దిశగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అందించిన సంయుక్త మార్గనిర్దేశన మేరకు రాష్ట్ర పోలీసు విభాగం తీసుకున్న చొరవను, చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ నోట్ వివరిస్తుంది.  గౌరవనీయ భారత ప్రధాన మంత్రి ప్రతిపాదించిన ‘స్మార్ట్ పోలీసింగ్’ భావనకు అనుగుణంగా ఈ కింద తెలిపిన కీలక అంశాల ప్రాతిపదికగా ఈ ప్రయత్నాలు జరిగాయి. ఇందులోఖచ్చితంగా ఉండటం, సున్నితంగా వ్యవహరించడం,ఆధునికత – మొబైల్, ఎల్లవేళలా అలర్ట్ గా ఉండటం – జవాబుదారీతనంతో వ్యవహరించడం వంటివి ఉన్నాయి.అలాగే విశ్వసనీయత – భాద్యతాయుత పనితీరు సాంకేతికత వినియోగం – శిక్షణ పొందడం, శాంతి భద్రతలు పటిష్టంగా అమలుచేయడం వంటివి వున్నాయి. 


తెలంగాణా రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ సంతృప్తికర స్థాయిలో ఉన్నది. గడచిన ఆరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ కూడా తీవ్రమైన శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు. ఆయా  భాగస్వామ్య పక్ష్యాల సమన్వయంతో రాష్ట్రంలో ఎక్కడ కూడా అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూడటంలో రాష్ట్ర పోలీసులు పూర్తిగా సఫలమయ్యారు. దానికి అవసరమైన రీతిలో క్రియాశీలక చొరవ ప్రదర్శించారు.  ప్రజల రక్షణ, శాంతి భద్రతలు కాపాడే విషయంలో రాష్ట్ర పోలీస్ విభాగం కమ్యూనిటీ పోలీసింగ్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. 



హైదరాబాద్ తో పాటుగా  రాష్ట్రంలోని అనేక ప్రధాన నగరాలు, పట్టణాలలో లక్షలాది సి.సి.టి.వి. కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎంతోమంది నేరస్తులను అరెస్ట్ చేయడానికి వీలైంది. నేరానికి పాల్పడితే కటకటాలు తప్పవనే సందేశం నేరస్తులకు వెళ్ళేలా చేయడానికి ఇది చాలా ఉపయోగపడింది.  టి.ఎస్. కాప్, హాక్ ఐ, సైబర్ క్రైం డిటెక్షన్ టూల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక అప్లికేషన్లను వినియోగించుకుంటూ, బాధితులకు సత్వర న్యాయం అందించే ప్రయత్నాలు కూడా ఎంతగానో సఫలీకృతమయ్యాయి. 


రాష్ట్రంలో సంచలనం రేపిన అనేక కేసులను అవి జరిగిన 24 గంటలలోనే చేదించడం జరిగింది. నిందితులను అరెస్ట్ చేసి, త్వరిత గతిన విచారణ పూర్తి చేసి,  నేరాలకు పాల్పడిన వాళ్లకు వెంటనే శిక్షలు పడేలా ప్రయత్నాలు జరిగాయి.  మహిళలు,  పిల్లలపై జరిగిన అనేక నేరాలలో విచారణ అనంతరం కోర్టులు నేరస్తులకు యావజ్జీవ శిక్ష లేదా మరణ శిక్షలు విధించాయి. మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడే వాళ్ళపై పి.డి. చట్టం కింద కేసులు బుక్ చేసి, వాళ్ళు తిరిగి నేరాలకు పాల్పడకుండా కట్టడి చేయడం జరిగింది. 


హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరొందిన అనేక ప్రాంతాలో మత పరమైన శాంతి భద్రతల పరిస్థితి కూడా పూర్తిగా అదుపులో ఉన్నది. అన్ని ప్రాంతాలలో ప్రశాంతత ఉన్నది. ఎక్కడా అవాంచనీయ సంఘటనలు లేవు. బోనాలు, గణేష్ ఉత్సవాలు, బక్రీదు, మొహర్రం, బతుకమ్మపండగ వంటి సందర్భాలలో అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.  ప్రజల సహాయ సహకారాలతో అవన్నీ ప్రశాంతంగా ముగిశాయి. ఏమైనా ఉల్లంఘనలు జరిగితే నిర్దిష్ట చట్టాల పరిధిలో కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. 


 సి.సి.టి.వి. ఆధారిత పర్యవేక్షణ అన్నది ఒక వినూత్న ప్రక్రియ.  ప్రజలు తమంత తాముగా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, చట్ట బద్ధ సంస్థల మార్గదర్శకత్వం, సహాయంతో దానిని అమలు చేసుకుంటున్నారు.  ఈ ప్రయత్నానికి చట్టబద్ధత కల్పించడానికి గాను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా ప్రజా భద్రత (ప్రమాణాలు) అమలు చట్టం, 2013 రూపొందించింది.  నేర నియంత్రణలో పౌరులు, కమ్యూనిటీకి భాగస్వామ్యం కల్పించడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.  కార్పోరేట్ సామాజిక భాద్యత పరిధిలో  ప్రభుత్వ రంగ కంపెనీలు, కార్పోరేట్లను కూడా ఈ ప్రయత్నంలో భాగస్వామ్యులుగా చేయడం జరిగింది. సామాజిక భాద్యత కింద  ఈ వ్యవస్థ ఏర్పాటుకు నిధులు అందించే వెసులుబాటు ఇందులో ఉన్నది.

Updated Date - 2022-06-11T22:12:21+05:30 IST