Telanganaకు నిలిచిపోనున్న విద్యుత్ క్రయవిక్రయాలు

ABN , First Publish Date - 2022-08-19T04:28:40+05:30 IST

తెలంగాణకు విద్యుత్ క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. డిమాండ్ను బట్టి రోజుకు 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఎక్స్చేంజ్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు...

Telanganaకు నిలిచిపోనున్న విద్యుత్ క్రయవిక్రయాలు

హైదరాబాద్: ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణకు విద్యుత్ క్రయవిక్రయాలు నిలిచిపోనున్నాయి. డిమాండ్ను బట్టి  రోజుకు 5 నుంచి 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఎక్స్చేంజ్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. తెలంగాణతో పాటు 13 రాష్ట్రాలకు ఎక్స్చేంజ్లో విద్యుత్ కొనుగోలు నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ అధికారులతో టీఎస్ విద్యుత్ అధికారుల సంప్రదింపులు జరుపుతున్నారు. ఎక్స్చేంజ్లో విద్యుత్ క్రయవిక్రయాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఈ సందర్బంగా ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు స్టే ఉన్నప్పటికీ విద్యుత్ ఎక్స్చేంజ్లో ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. టీఎస్ విద్యుత్ సంస్థలను ఇబ్బంది పెట్టాలని కేంద్రం చూస్తోందన్నారు. ‘‘తెలంగాణలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం. సోమవారం హైకోర్టులో కంటెంప్ట్ వేస్తాం. విద్యుత్ సంస్థల యాజమాన్యానికి ప్రజలు సహకరించాలి.’’ అని ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ కోరారు. 



Updated Date - 2022-08-19T04:28:40+05:30 IST